"30 మున్సిపాలిటీలకుపైగా సులువుగా గెలుస్తామనుకున్నాం"
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30 మున్సిపాలిటీలకు పైగా సులువుగా గెలుచుకుంటామని అనుకున్నామని కానీ కొంత తగ్గిందని అన్నారు. హంగ్ వచ్చిన చోట కూడా మాకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ కు కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గాలిలో మేడలు కట్టింది కానీ.. క్షేత్రస్థాయిలో ప్రజలు వారికి ఆశించిన మున్సిపాలిటీలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
ఇక కరీంనగర్, నిజామాబాద్ మినహాయిస్తే బీజేపీ ప్రభావం ఎక్కడా అంతగా లేదని కేటీఆర్ పేర్కొన్నారు. స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా చైర్మన్ పీఠాలను దక్కించుకోవడంలో కీలకమైన ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదు విషయమై ఇప్పటికే సీఎస్, రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడినట్లు కేటీఆర్ వెల్లడించారు.
ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం కష్టపడ్డ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్స్ కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికలకు కొలమానం కాబోవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మన టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలని పేర్కొన్నారు. ఈ మేరకు భవిష్యత్తులో ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇక తెలంగాణాలో ఎంతో ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల ఘట్టం ముగిసింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఈనెల 11న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 74 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ విజయకేతనం ఎగురవేసింది. అలాగే బీఆర్ఎస్ 17 చోట్ల విజయం సాధించింది. ఇక మున్సిపాలిటీల్లో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేక చతికిలపడింది. ఇక 24 చోట్ల హంగ్ ఏర్పడింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications