హైదరాబాద్‌లో బుట్టల్లో పెట్టి ఫ్రీగా టమోటాలు పంపిణీ

హైదరాబాద్: ఇవ్వాళ తెలంగాణ మంత్రి, అధికార భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పుట్టినరోజు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి, కేసీఆర్ జన్మదిన వేడుకలను జరుపుకొన్నారు. రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు.

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లో పలు పోటీలను నిర్వహించారు. క్రీడా శాఖ మంత్రి డాక్టర్ బి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్.. తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ పోటీలను ప్రారంభించారు. గౌడ కార్పొరేషన్ ఛైర్మన్లు పల్లె రవికుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇందులో పాల్గొన్నారు.

tomato1

గిఫ్ట్ ఏ స్మైల్ కింద వీడియో కెమెరా మెన్ లకు హెల్త్ ఇన్సూరెన్స్ పత్రాల పంపిణీ చేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో కేటీఆర్ బర్త్‌డే ట్వీట్స్ హోరెత్తించాయి. ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇక సంతోష్ అనే యువకుడు వినూత్నంగా కేటీఆర్‌కు విషెస్ తెలిపాడు. హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అని రాసి ఉన్న ఫ్లెక్సీతో పారా గ్లైడింగ్ చేశాడు.

బీఆర్ఎస్ నాయకుడు అరవింద్ అలిశెట్టి 12 అడుగుల ఎత్తు, 45 అడుగుల వెడల్పుతో పింక్ కలర్‌లో కేటీఆర్ ప్రతిమతో పాటు ఆయన జీవిత సైజు చిత్రాలను పెయింట్ చేసిన బస్సును హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో తిప్పారు. తెలంగాణ సెక్రటేరియట్, టీ-హబ్, దుర్గం చెరువు ఫ్లైఓవర్ వంటి చోట్ల ఈ బస్సు సందడి చేసింది.

tomato2

బీఆర్ఎస్‌కే చెందిన రాజనాల శ్రీహరి.. వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు టమోటాలను ఉచితంగా పంపిణీ చేశారు. బుట్టల్లో పెట్టి మరీ వాటిని పేదలకు అందజేశారు. సికింద్రాబాద్‌లోని పార్శీగుట్ట చౌరస్తాలో ఈ మధ్యాహ్నం ఆయన టమోటా బుట్టలను పేదలకు పంచిపెట్టారు. వరంగల్, కరీంనగర్.. వంటి నగరాల్లో కూడా టమోటాలను పంపిణీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+