హరీష్ రావుకు సపోర్టుగా KTR సంచలన ట్వీట్.. కవితకు బిగ్ షాక్..?
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో KTR సంచలన ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు ఉన్నారని కవిత కొన్ని గంటల ముందు ఆరోపించిన విషయం తెలిసిందే. కేసీఆర్ కు అవినీతి మరకలు అంటించింది హరీశ్ రావు, సంతోష్ రావులే అని కవిత సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండిస్తూ కేటీఆర్ హరీష్ రావుకు కేటీఆర్ మద్దతుగా నిలిచారు.
మాజీ మంత్రి హరీశ్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలకు కౌంటర్ గా కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పోస్టు చేసిన వీడియోను ఆయన రీ ట్వీట్ చేశారు. అందులో " ఇది మా డైనమిక్ లీడర్ హరీశ్ రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్" అని క్యాప్షన్ ఇచ్చారు. అలాగే " కేసీఆర్ ప్రియ శిశ్యుడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇరిగేషన్ శాఖ గురించి నేర్చుకుని ఉంటారాని ఆశిస్తున్నా" అని పేర్కొన్నారు.
This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏
— KTR (@KTRBRS) September 1, 2025
I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu https://t.co/w5YGJCETtL
అంతకుముందు కవిత మాట్లాడుతూ.. 'మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు. కడుపు రగిలిపోతోంది. తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్ కు తిండిమీద డబ్బు మీద యావ ఉండదు. ఇదంతా హరీష్ రావు, సంతోష్ రావు వల్లే జరిగింది' అని ఎమ్మెల్సీ కవిత చేసి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. వీరి వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ము, ధైర్యం ఉంటే.. వారిద్దరిపై విచారణ జరిపించాలని సవాల్ చేశారు.

"హరీష్ రావు వల్లే కేసీఆర్‌కు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. సంతోష్ రావు, హరీష్ రావు ఇద్దరూ అవినీతి కొండలు. కాళేశ్వరం కేసులో హరీష్ రావు దే ముఖ్య పాత్ర. హరీష్ రావు అవినీతి చేశారు కాబట్టే రెండోసారి ఆ శాఖను కేసీఆర్ ఇవ్వలేదు. కేసీఆర్ చుట్టూ ఉంటూ ఆయన పేరు చెప్పుకుని చెత్త పనులన్నీ చేసి కేసీఆర్ కు మరకలు అంటించారు. ప్రజల గురించి కేసీఆర్ ఆలోచిస్తే సొంత ప్రయోజనాల గురించి వాళ్లు ఆలోచించారు" అని ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications