KTR: పోలింగ్, ఫలితాల తేదీలు కూడితే కేసీఆర్ లక్కీ నంబరే వస్తుంది.. కేటీఆర్..!
సీఎం కేసీఆర్ లక్కీ నంబర్ ఎంతంటే.. ఏముంది 6 అని చెబుతారు. అవును కేసీఆర్ 6 నంబర్ బాగా కలిసి వస్తుంది. అందుకే కేసీఆర్ ఏం చేసిన కేసీఆర్ తన లక్కీ నంబర్ 6 కలిసొచ్చేలా చేస్తారు. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నిక షెడ్యూల్ విడుదలు చేసింది. నవంబర్ 30 ఎన్నికలు నిర్వహిస్తుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటించనున్నట్లు వివరించింది. అయితే పోలింగ్ తేదీ, ఫలితాల తేదీ రెండు కూడితే 6 నంబరే వస్తుంది.
అంటే ఇది కేసీఆర్ లక్కీ నంబరే.. అవును ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ లక్కీ నంబర్, ఎన్నికల షెడ్యూల్ ముడిపెడుతూ మాట్లాడారు. పోలింగ్ తేదీ నవంబర్ 30లో మూడు, కౌంటింగ్ తేదీలోని 3 కలిపితే ఆరు అవుతుందని ఆసక్తకరంగా చెప్పారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ సోమవారం హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించారు. రూ.114 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారు.

అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్.. బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు. కాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నేటి నుంచి ఎమ్మెల్యే, మంత్రులు అధికారిక వాహనాలు ఉపయోగించరాదు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించరాదు. దీంతో మంగళవారం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారానికే పరిమితం కానున్నారు. కేటీఆర్ గత 15 రోజులు బిజీగా మారారు. రోజుకు రెండు, మూడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మరోవైపు కేసీఆర్ అనారోగ్యం నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ జబర్దస్త్‌గా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ఇంట్లో కూర్చోని కూడా ప్రజల కోసం అన్నిచేస్తున్నాడని వివరించారు త్వరలో బయటికి వచ్చి అన్ని ప్రకటనలు చేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇవి ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు కావని.. సీఎం ఎన్నుకునే ఎన్నికలని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు ఉండదన్నారు.












Click it and Unblock the Notifications