ఆ జిల్లాలను ముట్టుకుంటే అగ్గిపుట్టిస్తాం - కేటీఆర్ హెచ్చరిక..!!

తెలంగాణలో జిల్లాల పునర్విభజన చుట్టూ రాజకీయం నడుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో చేసిన జిల్లాల పునర్విభజనలో సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాల పునర్విభజన కోసం ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ అంశం పైన న్యాయమూర్తి... అధికారులతో కమిటీ వేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రత్యేకించి జిల్లాల పేర్లు ప్రస్తావిస్తూ.. వాటిని ముట్టుకుంటే అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు.

మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని పట్టణాలను అభి వృద్ధి చేశామని చెప్పారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ అభివృద్ధి జరగలేదని, పంచాయతీలకు ట్యాంకర్లలో నీరు, ట్రాక్టర్లలో డీజిల్ కూడా లేకుండా పోయిందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో 40 సీట్లు వచ్చిన బీఆర్ఎస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కుంటుపడేసిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రూ.73 వేల కోట్లతో రైతుబంధు పథకం తెచ్చామని వివరించారు. కాంగ్రెస్ గత పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు. గత రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికీ న్యాయం చేయలేదని మండిపడ్డారు. అదే విధంగా జిల్లాల పునర్విభజన పైన జరుగుతున్న చర్చను కేటీఆర్ ప్రస్తావించారు.

ktr-seriously-reacts-over-districts-reorganization-proposals-in-common-mahabub-nagar-dist

వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను తొలగిస్తామని ఓ మంత్రి చెబుతున్నారని, జిల్లాలను ముట్టుకుంటే అగ్గిపుట్టిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. అదే సమయంలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. మిగిలిన 10 శాతం చేయడం కాంగ్రెస్‌కు చేతకావడం లేదని కేటీఆర్ విమర్శించారు. గతంలో కేసీఆర్ హయాంలో పాలమూరును మైగ్రేషన్ జిల్లా కాకుండా ఇరిగేషన్ జిల్లాగా మార్చారని కేటీఆర్ వివరించారు. పాలమూరుకి వస్తున్న రేవంత్.. జిల్లాలకు ఏ ప్రాజెక్టులు తెచ్చారో చెప్పాలని.. తాము తెచ్చినవి ఎందుకు వెళ్లిపోయాయో చెప్పాలని డిమాండ్ చేసారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌తో పాటు పాలమూరులో అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ను పండపెట్టి తొక్కి గెలుస్తామంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+