ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్: యువతకు కేటీఆర్ కీలక హామీలు, డ్యాన్స్ చేసి హోరు (వీడియో)
ఎల్లారెడ్డిపేట: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారని, గతంలో 11 ఛాన్సులు ఇస్తే రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో 24 గంటల విద్యుత్ ఎందుకివ్వలేదని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో చీకట్లు అలుముకుంటాయన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ బీమా అమలు చేసుకుందామన్నారు. తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల బీమా ఇవ్వబోతున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ను ఓడించేందుకు ఢిల్లీ నుంచి చాలా మంది వస్తున్నారని.. సింహం మాత్రం సింగిల్‌గానే వస్తుందని బీఆర్ఎస్ గురించి చెప్పారు.

కాంగ్రెస్ నేతలు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఢిల్లీ నేతలపైనే ఆధారపడతారన్నారు కేటీఆర్. ఎన్నికలు రాగానే పాలిటికల్ టూరిస్టులు అనేక మంది వస్తారని.. ఏవేవో చెబుతారన్నారు. ప్రజలు ఆగం కావొద్దన్నారు. దొరల తెలంగాణ కావాలా? ప్రజల తెలంగాణ కావాలా? అని రాహుల్ గాంధీ అడుగుతున్నారని.. ఆయనకు నేను చెప్పేది ఒకటే.. దొరలు ఎవరో తెలంగాణ ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలే రాహుల్ కు సరైన సమాధానం చెబుతారన్నారు.
టీఎస్‌పీఎస్సీలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేనని.. లోపాలను ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తామని కేటీఆర్ అన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ కాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. గత ఐదేళ్లలో 2.30 లక్షలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేసన్లు ఇచ్చామని తెలిపారు. ఇందులో లక్షా 60 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామి ఇచ్చారు.
Ramanna dance 🔥🔥@KTRBRS #KCROnceAgain #KTR pic.twitter.com/zBFzQnOPdc
— N@V€€N (@NaveenTs24) November 6, 2023
యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్.. పెద్ద ఎత్తున హాజరైన యువతలో ఊపును తీసుకొచ్చేలా చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్టేజిపై కలిసి డ్యాన్స్ చేశారు. పార్టీ కార్యకర్తలు, యువకులతో కలిసి కాసేపు డ్యాన్స్ చేశారు. చేతులు పైకి ఊపుతూ ఉత్సాహంగా చిందేయడంతో యువత అంతా పెద్ద ఎత్తున కేకలు వేస్తూ మద్దతు ప్రకటించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications