మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణం.. హాజరైన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు
మునుగోడు ఎమ్మెల్యే గా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభలోని తన ఛాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి .. హాజరైన మంత్రులు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
మునుగోడులో ఎమ్మెల్యేగా విజయం సాధించిన కూసుకుంట్ల
నేడు ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని మంత్రులు అభినందించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ రూల్ బుక్స్ ను, ఐడెంటిటీ కార్డును అందించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, తనతో హోరాహోరీగా తలపడ్డ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై 10 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మునుగోడు ఎమ్మెల్యే గా అవకాశాన్ని చేజిక్కించుకున్నారు.
మునుగోడు అభివృద్ధిపై ఫోకస్ పెట్టనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
ఇక మునుగోడు నియోజకవర్గంలో మూడున్నరేళ్ళుగా జరగని అభివృద్ధి, ఇప్పుడు నియోజక వర్గ ప్రజలకు చేసి చూపిస్తానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. తాము ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పక నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. మళ్ళీ వచ్చే ఎన్నికల సమయానికి నియోజకవర్గంలో పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి స్థానికంగా మునుగోడు ప్రజలు ఈ ఎన్నికల్లో ఇచ్చిన మద్దతు నిలబెట్టుకోవటానికి పని చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications