రేవంత్ కు కేవీపీ సంచలన లేఖ - నా రక్తం అంగీకరించదు..!!

హైడ్రా ప్రకంపనలు కాంగ్రెస్ పార్టీని తాకాయి. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఈ విషయం పైన ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ సీఎం రేవంత్ కు సుదీర్ఘ లేఖ రాసారు. అందులో సంచలన అంశాలను ప్రస్తావించారు. తన పైన ఆరోపిస్తున్నట్లుగా తన ఫాం హౌస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే మార్క్ చేయించాలని కోరారు. అలా ఉంటే తానే సొంత ఖర్చులతో కూల్చివేస్తానని లేఖలో కేవీపీ స్పష్టం చేసారు.

కట్టుబడి ఉన్నాను
కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు సీఎం రేవంత్ కు లేఖ రాసారు. అందులో కాంగ్రెస్ లో తన ప్రస్థానం గురించి వివరించారు. తాను కాంగ్రెస్ లో ఏ విధంగా పని చేసానో చెప్పుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్ హయాంలోనే మూసీ ప్రక్షాళన..సుందరీకరణ గురించి వివరించారు. అయితే, నాడు ఆర్దికంగా వెసులుబాటు లేక నిలిచిపోయిందని చెప్పుకొచ్చారు. తాను ఆ ప్రాజెక్టు కోసం చాలా కాలం నిరీక్షించానని..తన వంతు పాత్ర పోషించానని లేఖలో కేవీపీ వివరించారు. ఈ విషయంలో రేవంత్ ఉద్దేశాన్ని కేవీపీ ప్రశంసించారు.

KVP Ramachandra Rao letter to CM Revanth over his Farm House FTL limits

నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే
బీఆర్ఎస్ తో పాటుగా ప్రతిపక్షాలు ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. అజీజ్ నగర్ లో తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఫాం హౌస్ గురించి వస్తున్న ఆరోపణలను ప్రస్తావించారు. తన ఫాం హౌస్ పైన ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు తనకు బాధగా ఉన్నాయన్నారు. తన ఫాం హౌస్ ఎక్కడా ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లో లేవన్నారు. ఒక వేళ వాటి పరిధిలో ఉంటే ఫాం హౌస్ ను కూల్చటానికి తన కుటుంబ సభ్యులు సిద్దంగా ఉన్నారని చెప్పారు. సంబంధిత అధికారులను తన ఫాం హౌస్ వద్దకు వచ్చి నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే మార్క్ చేయాలని కేవీపీ సీఎం కు రాసిన లేఖలో కోరారు.

పరిశీలించండి
ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని...అధికారులు ముందుగా చెబితే విమర్శలు చేసిన వారిని వచ్చి పరిశీలించాలని కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే 48 గంటల్లో కూల్చివేస్తానని కేవీపీ స్పష్టం చేసారు. కాంగ్రెస్ నేతగా తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దని పేర్కొన్నారు. చట్టాన్ని తన పనిని తాను చేసుకోనిద్దామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డపేరు తేవటానికి తనలో నరనరాన ఉన్న కాంగ్రెస్ అంగీకరించనందుకే ఈ బహిరంగ లేఖ రాస్తున్నట్లు కేవీపీ స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+