Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొన్ని తప్పులు చేశారు: రేవంత్ రెడ్డి ప్రశ్నలకు ఇలా ధీటైన కౌంటర్లు

తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ, పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మధ్య రెండు మూడు రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది.

హైదరాబాద్: తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ, పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మధ్య రెండు మూడు రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది.

అధినేత చంద్రబాబుతో భేటీకి ముందు వరకు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ టిడిపి నేతలు ధీటుగా స్పందించారు. భేటీ అనంతరం మౌనం వహించారు. అంతకుముందు ఎల్ రమణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..

రేవంత్ రెడ్డి తప్పు చేశారా?

రేవంత్ రెడ్డి తప్పు చేశారా?

గతంలో ఎర్రబెల్లి దయాకర రావు తనపై ఆరోపణలు చేస్తే రేవంత్ రెడ్డి తన బిడ్డపై ఒట్టేసి తాను ఏం చేయలేదని చెప్పారని, ఇప్పుడు మాత్రం ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ఎల్ రమణ ప్రశ్నించారు. అంటే రేవంత్ రెడ్డి తప్పు చేశారు కాబట్టే వివరణ ఇవ్వడం లేదని, అంత సూటిగా మాట్లాడటం లేదని అభిప్రాయపడ్డారు. తాను తప్పు చేయలేదని ఆయన చెప్పగలరా అన్నారు.

రేవంత్ రెడ్డి కొన్ని తప్పులు చేశారు

రేవంత్ రెడ్డి కొన్ని తప్పులు చేశారు

రేవంత్ రెడ్డి కొన్ని తప్పులు చేశారని ఎల్ రమణ చెప్పారు. తాను తప్పు చేయలేదని, చేయబోనని చెప్పారు. తాను ఆర్థికంగా ఉన్న కుటుంబం నుంచి వ్చానని, రేవంత్ ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసునని చెప్పారు. తాను ఎవరితో ఎలాంటి చీకటి ఒప్పందం చేసుకోలేదన్నారు.

రేవంత్ రెడ్డి ప్రశ్నలకు ఇలా కౌంటర్

రేవంత్ రెడ్డి ప్రశ్నలకు ఇలా కౌంటర్

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనంటే, అధ్యక్షుడే పోటీ చేయకుంటే తప్పుడు సంకేతాలు పోతాయని, అందుకే 2018-19లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని రమణ చెప్పారు. అదే సమయంలో రేవంత్ తనపై విసిరిన ప్రశ్నలకు రమణ సమాధానం చెప్పారు.

సీక్రెట్ భేటీపై ధీటైన కౌంటర్

సీక్రెట్ భేటీపై ధీటైన కౌంటర్

తాను రేవంత్ రెడ్డిలో ఎవరితోను రహస్యంగా భేటీ కాలేదని రమణ స్పష్టం చేశారు. పార్టీపరంగా ముందుకు వెళ్లానన్నారు. తాను కాంగ్రెస్ నేతలను కలిస్తే తప్పేమిటని, నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్ పార్టీతో కలిసి రమణ ఢిల్లీకి వెళ్లలేదా అని రేవంత్ ప్రశ్నించారు. దానికి తాను పార్టీపరంగా వెళ్లానని, రహస్యంగా భేటీ కాలేదని రమణ ధీటైన కౌంటర్ ఇచ్చారు.

రెండు రోజులు ఆగేలేరా అన్న రేవంత్‌కు రమణ కౌంటర్

రెండు రోజులు ఆగేలేరా అన్న రేవంత్‌కు రమణ కౌంటర్

తాను చంద్రబాబుకే వివరణ ఇస్తానని, రెండు రోజులు ఆగలేరా అని రేవంత్ అన్నారు. దానికి కూడా రమణ సమాధానం చెప్పారు. తెలంగాణ టిడిపి అధినేతగా తాను వివరణ కోరానని, తనకు ఉన్న పరిమితుల మేరకు స్పందించాానని చెప్పారు. ఆరోపణలు వస్తే వివరణ ఎందుకు ఇవ్వలేదన్నారు.

స్టార్ హోటళ్లకు రేవంత్ రెడ్డి వచ్చారుగా

స్టార్ హోటళ్లకు రేవంత్ రెడ్డి వచ్చారుగా

టిడిఎల్పీ కార్యాలయం ఉండగా స్టార్ హోటళ్లలో సమస్యలపై సమావేశాలా అని రేవంత్ గురువారం ప్రశ్నించారు. దీనిపైనా రమణ స్పందించారు. గతంలో స్టార్ హోటళ్లలో నిర్వహించిన సమావేశాలకు రేవంత్ వచ్చారుగా అని నిలదీశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+