Crop Loan Waiver: రుణ మాఫీ ఇంకెప్పుడు..!
తెలంగాణలో లక్షలాది మంద రైతులు రుణ మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం రుణ మాఫీ చేసినట్లుగా చెబుతోంది. దీనిపై అన్నదాతలు మండిపడుతున్నారు. సగం మంది రైతులకు మాత్రమే రుణ మాఫీ అయినట్లు చెబుతున్నారు. మిగతా వారికి ఎప్పుడు రుణ మాఫీ చేస్తారని ప్రశ్నగా మిగిలింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాత్రం మాఫీ చేస్తామంటూ వాయిదాలు మీద వాయిదాలు వేస్తున్నారు. దీంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామేమి తప్పు చేశామని నిలదీస్తున్నారు.
డిసెంబర్ వరకు రుణ మాఫీ చేస్తామని మంత్రులు చెబుతున్నా.. ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. మరోవైపు రైతు భరోసా ఎప్పుడిస్తారు అనేది స్పష్ట లేకుండా పోయింది. వానకాలం సీజన్ ముగుస్తున్నా ప్రభుత్వం రైతు భరోసాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. రుణ మాఫీ కాక, రైతు భరోసా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దానికి తోడు చాలా చోట్ల ఇంకా ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించలేదు. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి.

ఇప్పటికే రైతు రుణ మాఫీ పూర్తి చేయాలని బీజేపీ రైతు హామీల సాధన దీక్ష చేసింది. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. తాజాగా రైతు భరోసాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. "నిన్న వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు. నేడు యాసంగి పెట్టుబడి సాయానికి పాతరేస్తారట ?
దగా పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రైతులకు రేవంత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ? కాంగ్రెస్ పాలనలో.. ఇంతకంటే దిక్కుమాలిన ఆలోచన ఇంకొకటి ఉంటదా ?
రేవంత్ ఏడాది ఏలికలో...తెలంగాణ రైతుకు గోస తప్ప.. భరోసా లేనే లేదు ? వానాకాలం పెట్టుబడి సాయానికి మోక్షం లేదు. యాసంగి రైతుభరోసాకు దారే కనిపించడం లేదు. 2 లక్షల రుణమాఫీ పేరిట దగాచేశారు. ఇక రైతుబంధును కూడా ఎత్తేస్తారా ?? ఇలాగైతే తెలంగాణలో సాగు సాగేదెలా..?" అని ట్వీట్ చేశారు.
"ఏడాదిలోనే బక్కచిక్కిన రైతు బతికేదెలా..??. సిగ్గు లేని కాంగ్రెస్ పార్టీ. చేతకాని హామీలు ఇవ్వడమెందుకు ?. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడం ఎందుకు ??.
అడ్డగోలు నిర్ణయాలతో అన్నదాతను ఆగం చేశారు. సంతోషంగా సాగిన వ్యవసాయాన్ని సంక్షోభంగా మార్చారు. మరోసారి ఎవరేంటో తేలిపోయింది.. బీఆర్ఎస్ నినాదం.. విధానం.. జై కిసాన్.. కాంగ్రెస్ పాలసీ ఎప్పటికీ.. నై కిసానే" అని పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications