కాంగ్రెస్ నాయకులు బాత్రూం కు వెళ్ళాలన్నా రాహుల్ గాంధీ పర్మిషన్ కావాలి .. కేటీఆర్ సెటైర్

కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేటీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలకు సంబంధం లేదని చెప్తున్నారని , ఈ ఎన్నికలు మోడీ కి రాహుల్ గాంధీకి మధ్య జరిగే యుద్ధం అన్నట్టు చెప్పుకుంటున్నారు అన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకు పోయిందని చెప్పారు. వరంగల్ ఓ సిటీలో జరిగిన లోక్ సభ ఎన్నికల సమాయత్త సభలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ నాయకులపై పంచ్ ల మీద పంచ్ లు వేశారు.

మీసాలు, గడ్డలు పెంచుకోవటం తప్ప , తొడలు కొట్టుకోవటం తప్ప ఇంకేం చెయ్యలేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్ళ బతుకు మొత్తం ఢిల్లీ నే అన్న ఆయన ఏది చెయ్యాలన్నా ఢిల్లీ నుండి అనుమతి తీసుకోవాలని చివరకు ఢిల్లీ నుండి పర్మిషన్ ఇస్తేనే బాత్ రూమ్ కైనా వాళ్ళు పోయేది అని సెటైర్లు వేశారు .

leaders want to take permission for every thing from the high command ktr said

అలాంటి వాళ్ళు తెలంగాణా రాష్ట్రం కోసం ఏం చేస్తారని ప్రశ్నించారు. , రాహుల్ గాంధీ కూర్చోమంటే కూర్చునే , నిల్చోమంటే నిల్చునే వారికి ఓటేస్తే మోరిలో వేసినట్టేనని కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ని ఉద్దేశించి మాట్లాడారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మరోమారు కాంగ్రెస్ నాయకులను చావు దెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+