ఎన్నికల వేళ- తెలంగాణ బీజేపీకి కొత్త సారథి..!!

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. ఎన్నికలకు సమాయాత్తం కావాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖలో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి.

పార్టీలో అసంతృప్తి పతాకస్థాయికి చేరింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలన్నీ బీజేపీకి ప్రతికూలంగా పరిణమించినట్లు భావిస్తోన్నారు ఆ పార్టీ సీనియర్ నాయకులు. ఇది కాస్తా పార్టీ అధిష్ఠానాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. కొందరు కీలక నేతలు సైతం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తేలిన నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం జోక్యం చేసుకుంది.

bjp

ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుంది. వారిద్దరూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వైఖరిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సొంత నిర్ణయాలతో బండి సంజయ్ తెలంగాణలో పార్టీని దిగజార్చుతున్నట్లు ఫిర్యాదు చేశారని సమాచారం.

దీని తరువాత- కీలక పరిణామం చోటు చేసుకుంది. ఊహించినట్టే- బండి సంజయ్‌ను తప్పించింది బీజేపీ అధిష్ఠానం. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డిని అపాయింట్ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం హవా నడుస్తోన్న నేపథ్యంలో- దానికి చెక్ పెట్టేలా కిషన్ రెడ్డికి తెలంగాణ పార్టీ పగ్గాలను అప్పగించినట్లు చెబుతున్నారు.

kishanreddy

రెండో ఆప్షన్‌గా పార్టీ ఓబీసీ మోర్చా చీఫ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ- బీజేపీ అధిష్ఠానం.. కిషన్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. గతంలో రెండుసార్లు పార్టీ పగ్గాలను అందుకున్న అనుభవం కిషన్ రెడ్డికి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010 నుంచి 2014 వరకు అధ్యక్షుడిగా పని చేశారు. విభజన తరువాత కూడా అంటే 2016 వరకు ఆయనే కొనసాగారు.

పార్టీ నేతలందరితో కిషన్ రెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఫలితంగా అందరినీ ఏకతాటిపైకి నడిపిస్తారని అధిష్టానం భావిస్తోంది.బండి సంజయ్‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని పార్టీ హైకమాండ్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. తెలంగాణ కోటా కింద కిషన్ రెడ్డి స్థానాన్ని బండి సంజయ్‌తో భర్తీ చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+