'కూల్.. కూల్..'గా హైదరాబాద్: తేలికపాటి జల్లులతో చల్లబడ్డ వాతావరణం
హైదరాబాద్: భానుడి భగభగలకు ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు శనివారం కాస్త ఉపశమనం లభించింది. ఉదయాన్నే చిరుజల్లులు కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది.
వాతావరణం మేఘావృతం కావడంతో కూకట్‌పల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, తార్నాక, కుత్బుల్లాపూర్, మల్కాజ్ గిరి, కాప్రా, శేరిలింగంపల్లి, అల్వాల్, సికింద్రాబాద్, నేరెడ్‌మెట్, కొండాపూర్ కుషాయిగూడ, కీసర, దమ్మయిగూడ, నాగారం, జవహర్ నగర్ ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.

నేరెడ్ మెట్ కాలనీలో నాలా పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి మురుగునీరు వచ్చి చేరింది. కర్ణాటక నుంచి లక్ష్యద్వీప్ వరకు ఆవరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో గాల్లో తేమశాతం పెరిగి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయని, వీటి ప్రభావం వల్లే నేడు రాష్ట్రంలో తేలికపాటి చిరుజల్లులు కురిశాయని వాతావరణశాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications