తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు

వర్షాకాలం ముగిసినప్పటికీ.. హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత కొద్ది రోజులుగా వర్షాలు కురిశాయి. తాజాగా, మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండబోదని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన సమయంలోనూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోని చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి.

Light rains in Telangana for three days

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, యానాంలో దిగువ ట్రూపూ ఆవరణలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

శుక్ర, శనివారాల్లో కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తాలోనూ పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోని కొన్ని చోట్ల శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+