న్యూ ఇయర్ వేళ కుమ్మేసిన మందుబాబులు.. ఎంత తాగారో తెలుసా..!!
న్యూ ఇయర్ వేళ మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రతీ ఏడాది కంటే ఈ సారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు పెరిగాయి. నెల రోజుల సమయంలో ఖజానాకు లిక్కర్ ఆదాయం భారీగా జమ అయింది. కొత్త సంవత్సరం వేళ మద్యం అమ్మకాల పైన ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించింది. దీంతో, మందుబాబులు అర్ద్రరాత్రి వరకు మద్యం కొనుగోలు చేసారు. దీంతో.. ఎక్సైజ్ శాఖ అంచనాలు మించి అమ్మకాలు జరిగాయి.
తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. డిసెంబర్ నెలలో రికార్డులు సృష్టించా యి. డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ 31 వరకు డిపోల నుంచి 3వేల 459 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్‌లో 2వేల 764 కోట్ల 78 లక్షల లిక్కర్ సేల్స్ జరగగా ఈ ఏడాది సరికొత్త రికార్డు సృష్టించాయి. గత ఏడాది డిసెంబర్‌తో పోల్చితే ఈసారి సుమారు 7 వందల కోట్ల మద్యం అమ్మకాలు పెరిగినట్టు తెలుస్తోంది. న్యూఇయర్ సందర్భంగా తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 171 కోట్ల 93 లక్షల మద్యం బిజినెస్ జరిగింది. ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.5,050 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం ఏలురై పారింది. డిసెంబర్ 31న రాత్రి బార్లు, పబ్బులు, క్లబుల్లో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. ఇక వైన్ షాపులు వద్ద భారీగా మందుబాబులు క్యూ కట్టి మద్యం కొనుగోలు చేసారు. తెలంగాణ ప్రభుత్వం అర్థరాత్రి ఒంటి గంటల వరకు మద్యం దుకాణాలకు సమయమిచ్చింది. బార్లు, రెస్టారెంట్లు, పబ్స్ రాత్రి ఒంటి గంటల వరకు మద్యం సర్వ్ చేయడానికి అనుమతి ఇచ్చింది.
ఈ క్రమంలో తెలంగాణలో లిక్కర్ సేల్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. న్యూఇయర్ జోష్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రూ.5 వేల కోట్ల విలువ చేసే మద్యం సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అదనంగా వెయ్యి కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ ఎక్కువగా జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. ఏపీలో కూడా లిక్కర్ సేల్స్ భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications