హైదరాబాద్‌లో ఆది, సోమవారం వైన్స్ షాపులు బంద్
హైదరాబాద్: మద్యం ప్రియులకు ఇది కాస్త చేదు వార్తే. హైదరాబాద్ నగరంలో ఆది, సోమవారాల్లో వైన్ షాపులు బంద్ కానున్నాయి. మహంకాళీ బోనాల పండగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ వ్యాప్తంగా నాన్ ప్రాప్రయిటరీ క్లబ్‌లు, స్టార్ హోటల్లు, రెస్టారెంట్లతోపాటు అన్ని వైన్ షాపులు మూసివేయపడతాయని సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
జులై 28న ఉదయం 6 గంటల నుంచి రెండు రోజులపాటు వైన్ షాపులన్నీ మూసివేయబడతాయి. సౌత్ ఈస్ట్ చాంద్రాయణగుట్ట, బండ్లగూడ వంటి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు మద్యం దుకాణాలు మూసివేస్తారు.

సౌత్ జోన్‌లో చార్మినార్, కమాటిపుర, హుస్సేనీ ఆలం, ఫలక్‌నుమా, మొఘల్‌పురా, చత్రినాక, షాలిబండ, మీర్‌చౌక ప్రాంతాల్లో జులై 8న ఉదయం 6 గంటల నుంచి రెండు రోజులపాటు కల్లు, వైన్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్ లు, మద్యం విక్రయించే సంస్థలు మూసి ఉంటాయని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ః
కాగా, ఆషాఢ మాసం ప్రారంభం నుంచి నగర వ్యాప్తంగా బోనాల పండగ వైభవంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీ మహంకాళి లాల్ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా అంబారీ పై అమ్మవారి ఊరేగింపు వేడుకలు జరగనున్నాయి. ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. భారీ ఎత్తున భక్తులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఆయా రూట్లలో వాహనాలను కూడా మళ్లించనున్నారు. దీనిపై ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. జులై 28, 29 తేదీల్లో నగరంలో వైన్ షాపులు పూర్తిగా బంద్ ఉండనున్నాయి.












Click it and Unblock the Notifications