Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోకసభ ఎన్నికలు 2019: భువనగిరి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

Recommended Video

    Lok Sabha Election 2019 : Bhuvanagiri Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

    తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో భువనగిరి ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. రంగారెడ్డి, వరంగల్ మరియు నల్గొండ మూడు జిల్లాలకు చెందిన శాసనసభ నియోజకవర్గాలతో కలిపి దీనిని ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం, వరంగల్ జిల్లా నుంచి జనగామ శాసనసభ నియోజకవర్గం ఉన్నాయి. గతంలో మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గంలోని తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, భువనగిరి శాసనసభ నియోజకవర్గాలు ఇందులో కలిపారు.

    భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి రెండుసార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. పదిహేనవ లోక్‌సభ, పదహారవ లోక్‌సభలకు ఎన్నికలు జరిగాయి. 2009లో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నుంచి బూర నర్సయ్య గౌడ్ గెలుపొందారు.

    2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 1,39,978 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సీపీఐ(ఎం) తరఫున పోటీ చేసిన నోముల నర్సింహయ్యకు 3,64,215 ఓట్లు రాగా, ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన చంద్రమౌళికి 1,04,872 ఓట్లు వచ్చాయి. కోమటిరెడ్డికి 44.70 శాతం ఓట్లు, నోములకు 32.29 శాతం ఓట్లు, చంద్రమౌళికి 9.30 శాతం ఓట్లు వచ్చాయి.

    #LokSabhaElection2019: All about bhuvanagiri Constituency

    2014లో బూర నర్సయ్య గౌడ్ (టీఆర్ఎస్) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్) పైన స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. నర్సయ్యకు 4,48,245 ఓట్లు రాగా, 36.99 శాతం ఓటింగ్ నమోదు అయింది. కోమటిరెడ్డికి 4,17,751 ఓట్లు వచ్చాయి. ఆయనకు పడిన ఓటింగ్ శాతం 34.17. బీజేపీ అభ్యర్థి ఇంద్రసేనా రెడ్డికి 1,83,217 ఓట్లు వచ్చాయి. కోమటిరెడ్డిపై బూర నర్సయ్య 30,494 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కోమటిరెడ్డికి 2009 కంటే పది శాతం తక్కువ ఓట్లు వచ్చాయి.

    భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో 14,92,251 మంది ఓటర్లు ఉన్నారు. 7,56,963 మంది పురుష ఓటర్లు, 7,35,388 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో 12,11,943 ఓట్లు పడ్డాయి. 81 శాతం పోలింగ్ నమోదయింది. 6,22,333 మంది పురుష ఓటర్లు, 5,89,610 మంది మహిళా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 20,0,432 జనాభా ఉంది. గ్రామీణ ప్రాంతంలో 85.29 శాతం, పట్టణ ప్రాంతంలో 14.71 శాతం జనాభా ఉంది.

    ప్రస్తుత ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వృత్తిరీత్యా డాక్టర్. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. లోక్‌సభలో 210 ప్రశ్నలు అడిగారు. తెలంగాణ యావరేజ్ 285 శాతంగా ఉండగా, నేషనల్ యావరేజ్ 273 శాతంగా ఉంది. పార్లమెంటులో 10 ప్రయివేటు మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టారు. తెలంగాణ యావరేజ్ 2 శాతం, నేషనల్ యావరేజ్ 2 శాతంగా ఉంది.

    బూర నర్సయ్య గౌడ్ అటెండెన్స్ 57 శాతంగా ఉంది. తెలంగాణ యావరేజ్ 69 శాతంగా ఉంది. నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఎంపీలాడ్స్ నుంచి రూ.15.6 కోట్లు ఖర్చు చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+