Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లండన్ తరహాలో జెయింట్ వీల్స్, స్కై టవర్ల నిర్మాణం: హైదరాబాద్, ఈ ప్రాంతాల్లో..!

లండన్ గ్రేట్ జెయింట్ వీల్ తరహాలో హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది.

హైదరాబాద్: అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. లండన్ గ్రేట్ జెయింట్ వీల్ తరహాలో హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. జెయింట్ వీల్స్ తోపాటు స్కై టవర్స్ కూడా సిద్ధం చేయనున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

హైదరాబాద్ తోపాటు ఈ ప్రాంతాల్లో జెయింట్ వీల్స్, స్కై టవర్లు

హైదరాబాద్ తోపాటు ఈ ప్రాంతాల్లో జెయింట్ వీల్స్, స్కై టవర్లు

జెయింట్ వీల్స్, స్కై టవర్ల నిర్మాణాల కోసం స్విట్జర్లాండ్ కు చెందిన ఇంటామిన్ ఎమ్యూజ్‌మెంట్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జరాల్డ్ స్లేన్డర్ తో మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ మేరకు సంస్థ పలు ప్రతిపాదనలను మంత్రికి వివరించింది. మొదటి దశలో దుర్గం చెరువు, ట్యాంక్‌బండ్ వద్ద జెయింట్ వీల్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

హైదరాబాద్ నగరానికి ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని, ఐటీతోపాటు అన్ని రంగాల్లోనూ నగరం అభివృద్ధి చెందుతోందన్నారు. అదే తరహాలో పర్యాటకంగా కూడా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా ఈ నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కేబినెట్‌లో చర్చించి వీటిపై తుది ఆమోదం తీసుకోనున్నారు.

తెలంగాణలో పర్యాటకంతోపాటు ఉపాధి అవకాశాలు

తెలంగాణలో పర్యాటకంతోపాటు ఉపాధి అవకాశాలు

ఈ ప్రతిపాదనలు త్వరలోనే సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆ తర్వాత వీటి నిర్మాణం కోసం.. ప్రభుత్వం ఆధ్వర్యంలో లేదా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. వీటి ఏర్పాటుతో రాష్ట్రం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని, అంతేగాక, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయన్నారు.

రెండో దశళలో ఈ ప్రాంతాల్లో జెయింట్స్ వీల్స్ ఏర్పాటు

రెండో దశళలో ఈ ప్రాంతాల్లో జెయింట్స్ వీల్స్ ఏర్పాటు

ఇక రెండో దశలో కొండపోచమ్మసాగర్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధి ఉదండాపూర్, కర్వెన రిజర్వాయర్లు, మహబూబ్‌నగర్‌లో జెయింట్ వీల్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కాగా, జెయింట్ వీల్స్, స్కై టవర్స్ ఏర్పాటు చేయడంలో తమ సంస్థ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందని ఇటామిన్ ఎమ్యూజ్‌మెంట్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జరాల్డ్ స్లేన్డర్ తెలిపారు.

హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి పర్యాటకాన్ని అభివృద్ధి చేసే అంశంలో తమవంతు పాత్ర పోషిస్తామని జరాల్డ్ స్లేన్డర్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+