Weather Update: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఆ జిల్లాల్లో వర్షాలు..!

వాతావరణ శాఖ అంచనా వేసినట్లు గానే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది వచ్చే రెండు రోజుల్లో ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారానికి వాయుగుండంగా మారే అవకాశం అంచనా వేశారు. ఇది మరింత బలపడి శనివారం రాత్రికి తుఫాన్ గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

తుఫాన్ గా మారితే దీనికి ఒమన్ సూచించిన పేరు రెమాల్ గా నామకరణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్లకల్లోలం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మత్య్సకారులు ఆదివారం వరకు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ తుఫాన్ పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణించనుంది. మే 25 బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Low pressure in Bay of Bengal is likely to bring rain

తుఫాన్ ప్రభావం తెలంగాణపై అంతగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షాలు కురిస్తాయని తెలిపింది. తుఫాన్ ప్రభావం ఉత్తర ఈశాన్య జిల్లాల మీద ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంటకు 30-నుంచి40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురస్తాయని పేర్కొంటున్నారు.

జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి పడే అవకాశం ఉంది. అయితే తెలంగాణలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతోన్నాయి. వర్షాలతో తగ్గిన టెంపరేచర్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. అటు ఏపీలో గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు రుతుపవనాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. మే 30 సాయంత్రానికి లేదా మే 31 ఉదయానికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+