వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!!
వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు వంట గ్యాస్ సరఫరాలో సమస్య లేదని చెబుతున్నా.. పంపిణీలో మాత్రం వినియోగదారులకు కష్టాలు తప్పటం లేదు. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీల్లో ఒక్కో సంస్థ ఒక్కో విధంగా పంపిణీ చేస్తోంది. బుకింగ్ కు లాకింగ్ పిరీయడ్ అమలు ద్వారా బుకింగ్స్ నియంత్రణ చేస్తున్నా.. ఆ మేర సరఫరా మెరుగు కావటం లేదు. దీంతో, పలు ప్రాంతాల్లో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా, గ్యాస్ కోసం వేచి చేస్తున్న వారి వివరాలు.. సరఫరా పై అధికారులు స్పష్టత ఇచ్చారు.
వంట గ్యాస్ సమస్య లేదని చెబుతున్నా.. ప్రస్తుతం రాష్ట్రంలో 15లక్షలపైగా సిలిండర్ల డెలివరీ పెండింగ్‌లో ఉంది. వీటి సరఫరాకు వారంపైనే పట్టే అవకాశం కనిపిస్తోంది. సిలిండర్ కోసం బుకింగ్ చేసిన తరువాత వినియోగదారుడి ఇంటికి సిలిండర్ చేరడానికి తక్కువలో తక్కువగా రెండు నుంచి మూడు వారాలు పడుతోంది. డోర్ డెలివరీ ఆలస్యం అవుతుండటంతో వినియోగదారులు ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 1.30 కోట్ల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల రోజువారీ బుకింగ్‌లు ఉంటాయి. రోజుకు ఐవోసీఎల్ 93 వేలు, హెచ్‌పీసీఎల్ 75 వేలు, బీపీసీఎల్ 47 వేల చొప్పున గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తుంటాయి. యుద్ధం ప్రారంభం కాకముందు సాధారణ రోజుల్లో రాష్ట్రంలో రోజూ వారీగా 3.50 లక్షల పెండింగ్ బిల్లులు(బుకింగ్) ఉండేవి. అందులో 2.15 లక్షల సిలిండర్లు సరఫరా చేసేవారు. మిగిలినవి మరుసటి రోజున డెలివరీ చేసేవారు. కానీ, ఇప్పుడు పెండింగ్ బుకింగ్‌ల సంఖ్య 15 లక్షలకు పెరిగింది.

15 లక్షలకు పైగా వినియోగదారుల నిరీక్షణ
ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న వారికి సిలిండర్ డెలివరీ కావడానికి 7-8 రోజుల సమయం పడుతుంది. ఆలోపు కొత్త బుకింగ్‌ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. సిలిండర్ల డెలివరీ వేగవంతం చేస్తే ఈ సంఖ్య కాస్త తగ్గుతుంది. వాస్తవానికి యుద్ధం ప్రభావంతో తొలి వారం, పది రోజులు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడే ఆందోళనతో బుకింగ్‌లు ఎక్కువ అయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం 'సిస్టమ్ లాక్' పద్ధతిని అమలులోకి తీసుకొచ్చింది. రీఫిల్ నుంచి రీఫిల్ బుకింగ్ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో సింగిల్ సిలిండర్ ఉంటే... 25 రోజులు, డబుల్ సిలిండర్లు ఉన్నవారికి 35 రోజుల లాక్ పెట్టింది. ఈ లాక్ టైమ్ అయిపోయిన తర్వాతే మళ్లీ సిలిండర్ బుక్ అయ్యేలా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసింది. దీని ద్వారా రెండు నెలలు సిలిండర్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. కొన్నాళ్లుగా ఇండియన్ ఆయిల్(ఐవోసీఎల్) సాఫ్ట్‌వేర్ మొరాయిస్తోంది. బుకింగ్‌లు సక్రమంగా కావడం లేదు. ఒకవేళ బుకింగ్‌లు తీసుకున్నా... సకాలంలో డెలివరీలు ఇవ్వడం లేదు. దీంతో రెండు నుంచి మూడు వారాలు సిలిండర్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!













Click it and Unblock the Notifications