వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రగ్రహణం ఎఫెక్ట్: తెలంగాణా యాదాద్రి, వేములవాడ రాజన్నతో పాటు ప్రముఖఆలయాల మూసివేత, పునః దర్శనాలిలా!!

|
Google Oneindia TeluguNews

నేడు చంద్రగ్రహణం కారణంగా తెలంగాణా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు మూతపడుతున్నాయి. ఈరోజు సాయంత్రం 5:32 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:18 గంటలకు ముగుస్తుంది. మొత్తం చంద్రగ్రహణం దశ వ్యవధి 01 గంట 24 నిమిషాలు 28 సెకన్లు పాటు ఏర్పడుతుంది. చంద్ర గ్రహణ కాలంలో ఎప్పుడూ ఆలయాలను తెరచి ఉంచరు. ఈ క్రమంలో తెలంగాణాలోని ప్రముఖ ఆలయాలు ఎప్పుడు మూతపడతాయి. తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయి అన్న వివరాల విషయానికి వస్తే..

చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఏపీలో తిరుమల, బెజవాడ దుర్గమ్మతో పాటు ప్రముఖఆలయాల మూసివేత, పునః దర్శనాలిలా!!చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఏపీలో తిరుమల, బెజవాడ దుర్గమ్మతో పాటు ప్రముఖఆలయాల మూసివేత, పునః దర్శనాలిలా!!

 నేడు యాదాద్రి ఆలయం మూసివేత, మళ్ళీ దర్శనం రేపే

నేడు యాదాద్రి ఆలయం మూసివేత, మళ్ళీ దర్శనం రేపే


తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణలోని యాదాద్రి పుణ్య క్షేత్రంలో కొలువైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని ఈరోజు ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి మూసివేసి రాత్రి 8 గంటలకు తెరచి ఆలయాన్ని సంప్రోక్షణ నిర్వహిస్తారు అర్చకులు. ఆపై రేపు రేపటి నుండి యధావిధిగా దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

వేములవాడ రాజన్న ఆలయం మూసివేత, తిరిగి తెరుచుకునే సమయాలివే

వేములవాడ రాజన్న ఆలయం మూసివేత, తిరిగి తెరుచుకునే సమయాలివే


ఇక వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు ఇప్పటికే మూసివేశారు. చంద్ర గ్రహణం కారణంగా స్వామి వారి ఆలయాన్ని మూసివేసినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. మంగళవారం సుప్రభాత సేవ అనంతరం రాజరాజేశ్వర స్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం, బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం, నాగేశ్వర స్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం ఉదయం 5 గంటల 38 నిమిషాలకు మూసివేశారు. గ్రహణం విడిచిన తర్వాత ఆలయ సంప్రోక్షణ చేసి రాత్రి 8 గంటలకు యధావిధిగా భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు.

ధర్మపురి నరసింహస్వామి, కాళేశ్వరం ఆలయాలలో ఇలా

ధర్మపురి నరసింహస్వామి, కాళేశ్వరం ఆలయాలలో ఇలా


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఉదయం ఐదు గంటలకే పూజాదికాలు పూర్తిచేసిన ఆలయ అర్చకులు ఆరు గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రేపు ఉదయం 6 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ అభిషేకం నిర్వహించి 9 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. కాళేశ్వరం లోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం తో పాటు అనుబంధ ఆలయాలను కూడా ఈరోజు ఉదయం 7 గంటలకే మూసివేశారు. ప్రాతఃకాల పూజ అనంతరం ఆలయాలను మూసివేశారు. రేపు ఉదయం ఆలయాలను సంప్రోక్షణ చేసిన తర్వాత ఉదయం 7 గంటల నుంచి భక్తులను అనుమతిస్తారు.

జోగులాంబ ఆలయం మూసివేత .. పునః దర్శనం సమయం ఇదే

జోగులాంబ ఆలయం మూసివేత .. పునః దర్శనం సమయం ఇదే


జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ లోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మూసివేశారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ ఈ ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత ఆలయ సంప్రోక్షణ నిర్వహించి ఏడున్నర గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

English summary
Lunar eclipse effect: Closure and re-darshans of famous temples along with Yadadri in Telangana!!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X