Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహా శివరాత్రికి కీసర గుట్ట, ఏడుపాయల వెళ్లాలనుకుంటున్నారా?

Secunderabad-Ayodhya express: ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలన్నీ కిటకిటలాడుతుంటాయి. కీసరగుట్ట, వేములవాడ, కొమురవెల్లి, కాళేశ్వరం, ఏపీలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది, క్షీరారామం, సోమారామం, అమరేశ్వర స్వామి, అమరలింగేశ్వర స్వామి, కోటప్ప కొండ, శ్రీముఖం..వంటి ఆలయాలు భక్తుల సందడితో కోలాహలంగా మారుతుంటాయి.

ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడిపించనుంది. శ్రీశైలం సహా తెలంగాణలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి భక్తులకు రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకుని రానుంది.

Maha Shivratri 2025 TGSRTC to run special buses to several temples including Keesara Gutta

ఈ క్రమంలో- కీసరగుట్ట, ఏడుపాయల వనదుర్గమ్మ జాతర, బీరంగూడ జాతరకు వెళ్లే భక్తుల కోసం పలు ప్రత్యేక బస్సులను నడిపించనుంది. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి అవి రాకపోకలు సాగించనున్నాయి.

1. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్- కీసరగుట్ట 90, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్- కీసరగుట్ట 100, అమ్ముగూడ- కీసరగుట్ట- 70, ఉప్పల్ క్రాస్ రోడ్స్- కీసరగుట్ట 25 బస్సులు ఈ మూడు రోజుల పాటు భక్తులకు అందుబాటులో ఉంటాయి.

Maha Shivratri 2025 TGSRTC to run special buses to several temples including Keesara Gutta

2. మహాత్మా గాంధీ సెంట్రల్ బస్‌స్టేషన్ నుంచి ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మవారి జాతరకు 125 బస్సులు నడిపించనున్నారు టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ జోన్ అధికారులు.

3. బీరంగూడ జాతర కోసం పఠాన్ చెరు నుంచి మొత్తం 30 బస్సులు ఈ మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రత్యేక బస్సులను నడిపించనున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యం కోసం కోఠి బస్టాండ్, రేతిఫైల్ బస్టాండ్‌లల్లో ప్రత్యేకంగా కమ్యూనికేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. వీటి నంబర్లు.. కోఠి- 9959226160, రేతిఫైల్- 9959226154.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+