హోలీలో మద్యం చీర్స్ : కార్యకర్తలకు మందు పోసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ !. ఫుల్ జోష్‌.!!

దేశ వ్యాప్తంగా రంగుల హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్నివర్గాల ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. కానీ టీఆర్ఎస్ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ డిఫరేంట్‌గా జరుపుకున్నారు. తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యకర్తలపై రంగులు చల్లారు. చల్లించుకున్నారు. సందడి చేశారు. వారితో కలిసి ఉత్సాహంగా డాన్స్ లు వేశారు.

 మందులో ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ హోలీ

మందులో ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ హోలీ


అంతే కాదు రంగులు చల్లిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ మందు కూడా చల్లారు. కార్యకర్తలకు హోలీ రంగులతో పాటు బీరును సప్లై చేశారు. అంతటితో ఆగలేదు.. ఆప్యాయంగా కార్యకర్తల నోట్లో లిక్కర్ పోస్తూ ఎంజాయ్ చేశారు. ఇంకొందరికి బీర్లు బాటిళ్ల పంచిపెట్టారు. హోలీ వేళ .. ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలర్ పుల్ రంగులతో పాటు వివిధ రకాల బ్రాండ్‌లతో కూడిన మద్యాన్ని పంపిణీ చేశారు. రంగులు చల్లుతూ హోలీ విషెస్ చెప్పారు. బీర్ బాటిళ్లతో చీర్స్ చెప్పుకున్నారు.

 రంగుల‌కు కిక్కు యాడ్ చేసి..

రంగుల‌కు కిక్కు యాడ్ చేసి..


హోలీలో రోజున రంగులకు కిక్కు యాడ్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యకర్తలకు మద్యం తాగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హోలీ సెలబ్రేషన్స్ లిక్కర్ లేకపోవడంతో లోటు అనిపించిందేమో .. అందుకే రంగుల పండుగకు క్కిక్కు ఎక్కించేపని చేశారంటూ నెటిజన్ల నుంచి కామెంట్స్ వెల్లవెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధి ఇలా కార్యకర్తలను చెడగొడుతున్నారంటూ మండిపడుతున్నారు.

 మద్యం అమ్మ‌కాలు నిషేధం అయినా..

మద్యం అమ్మ‌కాలు నిషేధం అయినా..


అసలు హోలీ రోజు ఎమ్మెల్యేకు మందు ఎక్కడ నుంచి తెచ్చారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హోలీ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వైన్స్ షాపులను క్లోజ్ చేసింది. రెండు రోజుల పాటు మ‌ద్యం అమ్మకాలను నిషేధించింది. కార్యకర్తలతో రంగుల హోలీ జరుపుకోవడం భాగానే ఉంది.. ఈ లిక్కర్ పంచుడేంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తరచూ ఏదో ఓ వివాదంలో చిక్కుకుంటుంటారు. గతంలోనూ ఓ మహిళ కలెక్టర్ తో మిస్ బిహేవ్ చేశారు.. అప్పట్లో అది పెద్ద చర్చనీయాంశమైంది. తాజాగా హోలీలో నాడు కార్యకర్తలకు మద్యం తాగిస్తూ.. పంచుతూ మరో సారి వివాదంలో శంకర్ నాయక్ చిక్కుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+