పవన్‌ను అంత మాట అంటావా: కత్తి మహేష్‌కు దిమ్మతిరిగేలా, తిడుతున్నారంటూ పోస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu
  Mahesh Kathi vs Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు ఘోరీ కడ్తా !

  హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరును ఉపయోగించుకుంటూ మీడియాలో నానుతున్న, హైప్ తెచ్చుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్ కత్తిపై జనసేనాని అభిమానులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ కత్తి జనసేనానిపై ఇష్టారీతిన మాట్లాడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తూ, మహేష్ కత్తికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

  డిబెట్‌లో సహనంతో సమాధానం చెప్పే వారిని కాకుండా తమలా దిమ్మతిరిగేలా జవాబు చెప్పేవారిని పిలవాలంటూ కోరుతున్నారు. ఈ మేరకు మహేష్ కత్తి తన ఫేస్‌బుక్‌లో వరుసగా రెండుమూడు పోస్టులు పెట్టారు. తనకు పవన్ అభిమానుల నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ, తిడుతున్నారంటూ పేర్కొన్నారు.

  పవన్ కళ్యాణ్ పైన ఇష్టారీతిన రెచ్చిపోతున్నందువల్లే తాము కూడా హెచ్చరికలు చేస్తున్నామనేది అభిమానుల వాదనగా ఉంది. హైప్ రావడం కోసం ఆయన పవన్‌ను పదేపదే టార్గెట్ చేస్తున్నారని, దీంతో కొందరు అభిమానులు ఉద్రేకంతో మాట్లాడుతుండవచ్చునని గతంలోనే కొందరు ఫ్యాన్స్ అన్నారు. మహేష్ కత్తి జనసేనానిపై సోషల్ మీడియాలో, టీవీ చర్చల్లో ఇష్టారీతిన మాట్లాడుతున్నందున అభిమానులు స్పందిస్తున్నారని అంటున్నారు. తొలుత ఆయన మౌనం వహిస్తే అంతా సర్దుకుంటుందనేది చాలామంది వాదన.

   నువ్వు హైప్ కావడానికి పవన్ కళ్యాణ్‌ను ఎంచుకున్నావ్

  నువ్వు హైప్ కావడానికి పవన్ కళ్యాణ్‌ను ఎంచుకున్నావ్

  అందరికీ నమస్కారం అంటూ ప్రారంభించారు. తన పేరు హుస్సేన్ అని, కామెడీగా వచ్చానని, మన కత్తి మహేష్ గురించి మాట్లాడేందుకు వచ్చానని, అతని గురించి మాట్లాడే దౌర్భాగ్యమైన పరిస్థితి తనకు వచ్చిందని, చివరకు అతని గురించి కూడా మాట్లాడవలసి వస్తుందని, ఏయ్ కత్తి మహేష్.. నువ్వేదో మాట్లాడుతున్నావ్.. మేం కామ్‌గా ఉంటున్నావని నువ్వు అనుకుంటున్నావ్, నువ్వు హైప్ కావడానికి పవన్ కళ్యాణ్‌ను ఎంచుకున్నావని ఆ వీడియోలో హుస్సేన్ వ్యాఖ్యానించారు.

  నువ్వు మాట్లాడే తీరు బాగాలేదని హెచ్చరిక

  నువ్వు మాట్లాడే తీరు బాగాలేదని హెచ్చరిక

  కేవలం పబ్లిసిటీ కోసమే పవన్ కళ్యాణ్‌ను ఎంచుకున్నావని, ఈ రోజు ఆయన గురించి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావని హుస్సేన్ ఆ వీడియోలో వాపోయారు. మా సహనాన్ని నువ్వు చేతగాని తనంగా తీసుకుంటున్నావని హెచ్చరించారు. కత్తి మహేష్‌కు మళ్లీ మళ్లీ చెబుతున్నామని, నువ్వు మాట్లాడే తీరు బాగా లేదని మండిపడ్డారు.

   మేం తిరగబడితే సమాజంలో తిరగలేవు

  మేం తిరగబడితే సమాజంలో తిరగలేవు

  కుక్కలు వాగుతుంటాయి.. పట్టించుకోవద్దని మా నాయకులు మాకు చెప్పారని హుస్సేన్ అన్నారు. కానీ నువ్వు పిచ్చికుక్కగా మారి అందరిని కరిచే విధంగా తయారవుతోందని కత్తి మహేష్‌ను ఏకిపారేశారు. అలాంటి కుక్కను ఏం చేయాలో తెలుసునని చెప్పారు. కత్తి మహేష్‌ను హెచ్చరిస్తున్నామని, పవన్‌ను అభిమానించే వారు లక్షలు, కోట్లలో ఉన్నారని, ఒక్కసారి మేం తిరగబడితే నువ్వు సమాజంలో తిరగలేవని గుర్తుంచుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

   పవన్ అభిమానుల్లో కొందరు సహనం వహిస్తారు

  పవన్ అభిమానుల్లో కొందరు సహనం వహిస్తారు

  తామే అతనిని ఇక్కడి వరకు తీసుకు వస్తామని చెబుతున్నారని, కానీ అది అబద్దమని హుస్సేన్ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంతమంది సహనం వహించవచ్చునని, అందరూ సహనం వహించరని, తిరగబడతారని అన్నారు. నువ్వు సుత్తి కొడుతున్నావని మండిపడ్డారు.

   పవన్ కళ్యాణ్‌ను అంత మాట అంటావా

  పవన్ కళ్యాణ్‌ను అంత మాట అంటావా

  నిన్న ఛానల్లో పవన్ కళ్యాణ్‌ను ఓ పొలిటికల్ జోకర్ అని ఎలా అంటావని అతను కత్తి మహేష్‌ను వీడియో ద్వారా ప్రశ్నించారు. సొంత పెళ్లాన్ని కాపాడుకోలేకపోయాడు, ఇక రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడని అనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావ్ రా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

   రేటింగ్స్ కోసం వెదవలను తీసుకొస్తున్నారు

  రేటింగ్స్ కోసం వెదవలను తీసుకొస్తున్నారు

  ఇంత మాట్లాడుతున్నా మేం సహనం వహిస్తుంటే నువ్వు పవన్ కళ్యాణ్ పైన మరీ రెచ్చిపోతున్నావని అతను కత్తి మహేష్ పైన మండిపడ్డారు. పవన్‌కు ఏం నాలెడ్జ్ ఉందని అంటున్నావని, అసలు నీకేం నాలెడ్జ్ ఉందని ప్రశ్నించారు. ఇలా పెళ్లాం, బిడ్డలను టార్గెట్ చేసి మాట్లాడుతారా, నువ్వు ఇలా బేవార్స్ పనులు చేస్తుంటే నిన్ను కూడా హైప్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రేటింగ్స్ కోసం నీలాంటి వెదవలను తీసుకు వచ్చి డిబేట్లు పెడుతున్నారని మండిపడ్డారు. కత్తి మహేష్‌ను మై సన్ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

  నాలా దిమ్మతిరిగే జవాబిచ్చే వారిని పిలవండి

  మీడియా కూడా డిబేట్‌కు సహనంగా ఉండేవారిని తీసుకు రావొద్దని, తనలాగా అక్కడికి అక్కడే గట్టి జవాబు చెప్పేవారిని పిలవాలన్నారు. పవన్ కళ్యాణ్‌ను రమ్మనమని కత్తి మహేష్ అంటున్నారని, అసలు ఆయనకు పవన్ ఎందుకని, నీకు పవన్ పీఏ, పవన్ ఇంట్లో పని చేసేవాడు కూడా సరిపోడని ఆవేదన వెళ్లగక్కారు. ఇలాగే చేస్తే బాగుండదని హెచ్చరించారు.

  జనసేనాని అభిమానుల తిట్లు అంటూ

  కత్తి మహేష్ మరో పోస్ట్ కూడా పెట్టారు. తనకు ఇలాంటి తిట్లు వస్తున్నాయంటూ ఆ పోస్ట్ పెట్టారు. ఇంతకంటే దారుణమైనవి కూడా ఉన్నాయని కత్తి మహేష్ పేర్కొన్నారు. ఇలా చేస్తూ పవన్‌ను తాను టార్గెట్ చేస్తున్నారని అనడం విడ్డూరమని పేర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్‌ను మొదట ఆయన టార్గెట్ చేయడం వల్లే తాము టార్గెట్ చేస్తున్నామనేది పవన్ అభిమానుల వాదన.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Mahesh Kathi posts videos of Pawan Kalyan fan in facebook. He said that Jana Sena chief fans are targetting me.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి