తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు
తెలంగాణలోని మహిళలకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
గ్రామైక్య సంఘాలకు ఈ క్యాంటీన్ల నిర్వహణ అప్పగిస్తామని సీఎస్ చెప్పారు. కలెక్టరేట్లు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పశ్చిమబెంగాల్‌లోని దీదీ కా రసోయ్, కేరళలోని క్యాంటీన్లపై ఇప్పటికే అధ్యయనం చేసిన్టలు సీఎస్ తెలిపారు.

క్యాంటీన్ల నిర్వహణపై మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. మహిళా శక్తి క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, అవసరమైన స్థలం తదితర వివరాలతో రోడ్ మ్యాప్ తయారు చేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌ను సీఎస్ ఆదేశించారు.
కొడంగల్‌లో గురుకులాలు: రూ. 73 కోట్ల నిధులు విడుదల
కొడంగల్ నియోజకవర్గంలో బీసీ గురుకుల విద్యా సంస్థల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 73 కోట్ల 45 లక్షల రూపాయలు మంజూరు చేసింది. కొడంగల్‌లో బీసీ గురుకుల జూనియర్ కాలేజీ నిర్మాణానికి 25 కోట్ల రూపాయలు, బీసీ గురుకుల పాఠశాల కోసం 23 కోట్ల 45 లక్షల రూపాయలు మంజూరు చేసింది.
బొమ్రాసిపేట మండలం బురాన్‌పేటలో బీసీ బాలికల గురుకుల పాఠశాల, కాలేజీ నిర్మాణం కోసం మరో 25 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో బీసీ గురుకుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications