ఆర్ఎస్ బ్రదర్స్‌లో భారీ అగ్ని ప్రమాదం: పూర్తిగా కాలిన భవనం, కోట్లలో ఆస్తి నష్టం
హైదరాబాద్: నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న నాలుగు అంతస్తుల ఆర్‌ఎస్ బ్రదర్స్ దుకాణంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
మంటలు తీవ్రంగా చెలరేగడంతో దాదాపు ఆ భవనం పూర్తిగా కాలిపోయింది. దుకాణంలోని వస్త్రాలు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5అగ్నిమాపక శకటాలతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

మొదట లిఫ్ట్ నుంచి పొగలు
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ముందు ఆ భవనం కింది అంతస్తులోని లిఫ్ట్ నుంచి పొగలు వచ్చాయి. రాత్రి పది గంటలకు దుకాణం మూసివేసి సిబ్బంది వెళ్లిపోయాక ఈ ఘటన జరిగింది. మూసి వేసిన దుకాణంలో నుంచి పొగలు రావడం గమనించిన సెక్కురిటీ సిబ్బంది, స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.

మూడంతస్తులకు అంటుకున్న మంటలు
ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దుకాణం షెట్టర్లు తెరవడానికి ప్రయత్నించగా.. కొద్ది సేపటి వరకు అవి తెరుచుకోలేదు. ఈ క్రమంలో మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు మిగతా మూడు అంతస్తులకు విస్తరించాయి. బట్టల దుకాణం కావడంతో ప్రమాదం తీవ్రత పెరిగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

మళ్లీ చెలరేగిన మంటలు
మంటలను అదుపు చేయడం ఇబ్బందికరంగా మారడంతో అగ్నిమాపక శాఖ అధికారులు ప్రత్యేక వాహనాలను రప్పించారు. మొత్తం 5ఫైరింజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఒక దశలో అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ మంటలు చెలరేగాయి.
Recommended Video


కోట్లలో ఆస్తి నష్టం
ఈ క్రమంలో పోలీసులు అబిడ్స్ ప్రధాన రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లించారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమంచి మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యుట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా ఆస్తి నష్టం సుమారు రూ.3కోట్లకుపైనే ఉంటుందని దుకాణ యజమాన్యం తెలిపింది.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications