Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైన హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ సంస్థ

హైదరాబాద్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ముఖ్యంగా సంవత్సరానికి ₹1 కోటి కంటే ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులను తొలగించవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా, పరిశోధన ,అభివృద్ధి (R&D) విభాగంలోని 50-55 సంవత్సరాల మధ్య వయస్సు గల ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని కూడా అందించినట్లు సమాచారం.

ఈ చర్యల ద్వారా ఉద్యోగుల వ్యయాలను దాదాపు 25% తగ్గించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, దాదాపు ₹1,300 కోట్ల వార్షిక పొదుపును డాక్టర్ రెడ్డీస్ సాధించగలదు. అయితే, ఈ వార్తలపై డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కంపెనీ ఈ తొలగింపుల గురించి లేదా వ్యయ తగ్గింపు చర్యల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

major Hyderabad-based pharma company is preparing to lay off employees

ఒకవైపు కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, మరోవైపు డిజిటల్ థెరప్యూటిక్స్ విభాగాన్ని పూర్తిగా మూసివేయవచ్చు లేదా న్యూట్రాస్యూటికల్స్ విభాగాన్ని కుదించవచ్చు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇది సుమారు 300-400 మంది ఉద్యోగులపై ప్రభావం చూపవచ్చు.బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం కంపెనీ తన ఉద్యోగుల్లో 25 శాతం కోత విధించబోతోంది. ఏడాదికి కోటి రూపాయలకు పైగా సంపాదించే వారితో సహా పలువురు సీనియర్ అధికారులను రాజీనామా చేయమని కోరినట్టుగా సమాచారం అందుతోంది.

50-55 ఏళ్ల మధ్య వయసున్న ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) కల్పించాలని అనుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే వివిధ శాఖల్లో అధిక వేతనం పొందుతున్న పలువురు ఉద్యోగులను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తోంది.అయితే ఈ వార్తలపై డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అధికారికంగా స్పందించిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

డాక్టర్ రెడ్డీస్ ఆదాయం
2024-2025 ఆర్థిక సంవత్సరం Q3 FY25 ఫలితాల్లో 14 శాతం వృద్ధి సాధించి ₹8,531 కోట్ల ఆదాయంగా ఉంది. 9 నెలల కాలానికి గానూ 15 శాతం వృద్ధి సాధించి ₹240,475 మిలియన్లుగా నిలిచింది. 2023-2024 ఆర్థిక సంవత్సరాని గానూ ₹28,011.10 కోట్లు సాధించింది. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2022-2023)తో పోలిస్తే 13.5% వృద్ధిని సూచిస్తుంది. కంపెనీ లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ, ఖర్చులను తగ్గించే పనిలో కంపెనీ యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+