కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతలను నేనే పంపించా: మల్లారెడ్డి సంచలనం
మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు తనకు తెలిసే కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పుకొచ్చారు. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్, బోడుప్పల్‌కు చెందిన కార్పొరేటర్లను తానే కాంగ్రెస్‌లోకి వెళ్లమని చెప్పినట్లు మల్లారెడ్డి మీడియా ఎదుటే వెల్లడించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్‌లో ఉంటూనే బీఆర్ఎస్కు కోవర్టులుగా పనిచేయాలని వారిని ఆదేశించినట్లు మల్లారెడ్డి తెలిపారు. వారు కాంగ్రెస్‌లో చేరినప్పటికీ గులాబీ పార్టీకే పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేగాక, బీఆర్ఎస్ కార్పొటేర్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పటికీ.. అక్కడ సరైన ప్రాధాన్యత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

తిరిగి సొంతగూటికి వచ్చేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పాత కాంగ్రెస్ నాయకులతో తమకు పొసగడం లేదని, తిరిగి బీఆర్ఎస్లోకి వస్తామంటున్నారని మల్లారెడ్డి చెప్పారు. ఎంపీ ఎన్నికలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని తాను చెప్పినట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు.
మరోవైపు, మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కూడా సమర్ధించడం గమనార్హం. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఇక, మల్లారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.
ఇది ఇలావుంటే, గత నెలలో కూడా మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలను ఇరుకునపెట్టేవిగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారన్నారు మల్లారెడ్డి. దీంతో ఒక్కసారిగా గులాబీ శ్రేణులు షాకయ్యాయి. ఏప్రిల్ 26న ఓ వేడుకకు వెళ్లిన మాజీ మంత్రి, అక్కడే ఉన్న ఈటల రాజేందర్‌ను కలిశారు. అనంతరం ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటలతో ఈ ఎన్నికల్లో నువ్వే గెలుస్తావు అని అన్నారు. దీంతో వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్న వీడియో వైరల్‌గా మారింది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications