'నిర్వాసితులతో హరీశ్ చర్చలు సఫలం!', కాంగ్రెస్ నిషేధిత పార్టీనా? : భట్టి

Subscribe to Oneindia Telugu

మెదక్ : మల్లన్న సాగర్ భూసేకరణ అంశంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో.. బుధవారం నాడు నిర్వాసితులతో ఆయన చర్చలు సఫలమైనట్లుగా సమాచారం.

గ‌జ్వేల్‌లో మ‌ల్లారెడ్డి గార్డెన్ లో.. ముంపు గ్రామమైన పల్లె పహాడ్ భూ నిర్వాసితులతో మంత్రి హరీశ్ రావు జరిపిన చర్చలకు రైతులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రస్ తో కలిసి మంత్రి హరీశ్ రావు ఈ సుదీర్ఘ చర్చను కొనసాగించారు. కాగా, ప్రభుత్వం తరుపున మంత్రి హరీశ్ రావు రైతులకు పూర్తి స్థాయి భరోసా ఇవ్వడంతో.. భూసేకరణకు అక్కడి రైతులు అంగీచారని సమాచారం.

భట్టి ఫైర్ :

Mallanna sagar people accepted Harish Rao discussions

మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వ వ్యవహరిస్తోన్న తీరును తప్పుబట్టారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క. లాఠీ చార్జీలో గాయపడ్డ నిర్వాసితులను పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.

దీనిపై పలు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించిన భట్టి.. తమ పార్టీ ఏమైనా నిషేధిత పార్టీనా.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు దేశంలో అంతర్భాగం కాదా.. అని నిలదీశారు. టీపీసీసీ నేతలు నిషేధిత క నేతలా.. మేమేమైనా తీవ్ర వాదులమా..? అంటూ ప్రశ్నించారు భట్టి.

మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ నిర్వాసితులను ప‌రామ‌ర్శించ‌డం కాంగ్రెస్ పార్టీ బాధ్య‌త‌న్న భట్టి.. రేపు తాము డీజీపీని కలుస్తామని, అప్పటికీ త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌క‌పోతే ఎన్ హెచ్ఆర్సీని ఆశ్రయిస్తామని ఆయ‌న తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mallanna sagar people are accepted Minister Harish Rao discussions. And they are accepted for the land registrations for the project

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి