నీ అభిమానం సల్లగుండా.. ఒంటిపై 14 మంది ప్రముఖుల చిత్రాలు "పచ్చబొట్టు"లుగా..!!
ఓ సినిమాలో ప్రముఖ హీరో చెప్పినట్టు మనషులను ఆపగలం కానీ అభిమానాన్ని ఆపలేం సార్ అని.. ఇదే మాటను ఓ వ్యక్తి సీరియస్ చాలా చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. తన ఒంటిపై ఏకంగా 14 మంది ప్రముఖుల చిత్రాలను పచ్చబొట్లుగా వేయించుకున్నారు. దీంతో అసలు ఆ వ్యక్తి ఎవరు ? ఆ స్టోరీ ఏంటి అని హాట్ టాపిక్ గా మారింది.
అసలు ఎవరు ఈ వ్యక్తి ???
వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్న ఆ వ్యక్తి తెలంగాణ వాసిగా తెలుస్తోంది. అతను రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రేగడి దోస్‌వాడ గ్రామానికి చెందిన అర్ధ మహేందర్‌రెడ్డిగా గుర్తించారు. తన అభిమానాన్ని విభిన్న పద్ధతిలో చాటుకునేందుకు.. ఈ తరహాలో చేసినట్టు చెబుతున్నాడు. తన ఒంటిపై ఏకంగా 14 మంది ప్రముఖుల చిత్రాలను పచ్చబొట్లుగా వేయించుకున్నారు. అలానే సమాజాన్ని మంచి మాటలతో ప్రభావితం చేయాలనే లక్ష్యంతో తన కారుపై అనేక సామాజిక సందేశాలు, సూక్తులు రాయించారు.

14 మంది ఎవరంటే..?
ప్రధాని మోదీ
దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా
చిరంజీవి
సోనూసూద్
పునీత్ రాజ్‌కుమార్
ఐపీఎస్ అధికారులు ఉమేష్ చంద్ర, సజ్జనార్
అతని తల్లిదండ్రుల చిత్రాలు ఉన్నాయి.
వీరితో పాటు పలువురు ప్రముఖుల చిత్రాలను పచ్చబొట్టుగా వేయించుకున్నారు.
అంతే కాకుండా మహేందర్‌రెడ్డి సామాజిక సేవలోనూ కూడా చురుకైన పాత్ర పోషిస్తూ మన్ననలు పొందుతున్నారు. 2007లో తన సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు రక్తదానం విలువను గ్రహించి.. ఇప్పటివరకు 130 సార్లకు పైగా రక్తదానం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు తన సంపాదన నుంచి ఇద్దరు విద్యార్థినుల ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అందిస్తుండటం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు.
కానీ మరోవైపు మాత్రం సినిమాలు, రాజకీయాలపై మనుషులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రెండు విషయాల్లోనే ప్రజలు వారి గురించి కూడా పట్టించుకోకుండా ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తారేమో అనిపిస్తుంది. ఫలానా హీరో కోసమో, ఫలానా రాజకీయ నాయకుడి కోసమే ఒకరిపై మరొకరు దుర్భాషలు ఆడుకుంటూ గోడవలకి దిగుతున్నారు. రాజకీయాల కారణంగా ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం, హత్యలు చేసుకోవడం చూశాం. ఇప్పుడు ఈ విష సంస్కృతి సినిమా హీరోల విషయంలో కూడా మళ్లీ మొదలవుతోంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications