'ఆమె' నగ్న ఫోటోలు పంపి అతన్నీ ఇరికించాడు..: ఎట్టకేలకు అరెస్ట్!
హైదరాబాద్: ఓ మహిళ నగ్న ఫోటోలతో మరో యువకుడికి టోకరా వేశాడో ప్రబుద్దుడు. అందినకాడికి దోచుకుని, అదీ చాలక మళ్లీ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఎట్టకేలకు అతని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ బెంజిసర్కిల్‌కు చెందిన నందిమల్ల గోపి ఉపాధి కోసం నగరానికి వలస వచ్చాడు. సూరారం కాలనీలో నివసిస్తూ ఫ్యాబ్రికేషన్ వర్క్స్ చేస్తున్నాడు. ఇతరుల పేర్లు, చిరునామాలతో సిమ్ కార్డులు తీసుకుని పలువురితో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో ఓ మహిళతో పరిచయం పెరగా.. ఎలాగోలా ఆమె నగ్న ఫోటోలు సంపాదించాడు.

ఆపై శ్రీనివాసరాజు అనే మరో వ్యక్తికి చాటింగ్ ద్వారా దగ్గరయ్యాడు. తాను అమ్మాయిని అని నమ్మించి యువతి నగ్న ఫోటోలను అతనికి పంపించాడు. ఆపై అతన్ని కూడా పంపమని కోరడంతో.. అతనూ నగ్న ఫోటోలు పంపించాడు. అప్పటినుంచి ఆ ఫోటోలు అడ్డుపెట్టుకుని అతన్ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అలా అతని నుంచి రూ.4.5లక్షలు కాజేశాడు.
అక్కడితో ఆగక మళ్లీ మళ్లీ బెదిరింపులకు దిగాడు. అడిగినంత డబ్బు ఇవ్వాలని వేధించడం మొదలుపెట్టాడు. రూ.20లక్షలు ఇవ్వాలంటూ తరుచూ వేధిస్తుండటంతో బాధితుడు శ్రీనివాసరాజు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 1.60లక్షల నగదు, బైక్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications