దారుణం: ప్రేయసితో పెళ్లికి ఒప్పుకోలేదని తల్లిని చంపేశాడు
హైదరాబాద్: తన ప్రియురాలితో వివాహానికి అడ్డుపడుతుందనే కారణంగా కన్న తల్లినే హతమార్చాడో ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన నగరంలోని దబీర్‌పురాలో ఆదివారం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు అక్రమ్ బిన్ ఇస్మాయిల్(23) తన తల్లి సజీరా బేగం(60)తో కలిసి దబీర్‌పురాలో నివాసం ఉంటున్నాడు. తన సోదరి, బావ తమ చిన్న ఇంట్లోనే ఉండటం అక్రమ్‌కు నచ్చేది కాదు.

అంతేగాక, తను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు తన తల్లి అంగీకరించకపోవడం కూడా అతడ్ని ఆగ్రహానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్రమ్.. తన తల్లిపై దాడికి దిగాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయింది.
వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సజీరా బేగం మృతి చెందింది. నిందితుడిపై హత్యా నేరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీర్‌చౌక్ ఏసీపీ గంగాధర్ తెలిపారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications