రూ. 10 వేలకు ఆశపడి 16 లక్షలు పోగొట్టుకున్న టెక్కీ! ఎలాగో తెలుసా?
సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించి కొందరు పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించుకుంటున్నారు. మీకు తమ ప్రొడక్ట్ నచ్చితే వెంటనే కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి అని వాట్సాప్ సహా కొన్ని సోషల్ మీడియాలో సందేశాలు వస్తున్నాయి.
వాటిపై క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయమని అడుగుతారు. ఒకవేళ వారు చెప్పినట్లుగా మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మాత్రం మన బ్యాంక్ ఖాతాల్లో ఉన్న సొమ్మంతా దోచేస్తారు. లేదంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ ఉత్పత్తులకు లైక్స్ కొడితే చాలు డబ్బులు చెల్లిస్తామంటూ మన వివరాలు సేకరించి ఆ తర్వాత మన వద్ద ఉన్న మొత్తాలను కాజేస్తారు.

ఇలాంటి మోసాలకు ఎక్కువగా మహిళలు, పిల్లలు, ఉద్యోగం చేయలేని వాళ్లు గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పలువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇలాంటి మోసాల పట్ల అవగాహన లేనివాళ్లు కూడా మోసాలకు గురవుతున్నారు.తాజాగా, ఆదిలాబాద్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఏకంగా రూ. 16.79 లక్షలు పోగొట్టుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు.. పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తన టెలిగ్రాంలో ఒక మెసేజ్ వచ్చింది. అందులో వచ్చిన మెసేజ్ మేరకు మొదట వారి ఉత్పత్తులకు లైకులు కొట్టాడు. దీంతో అతడి ఖాతాకు మొదట రూ. 10 వేలు నగదు జమ అయ్యింది. దీంతో ఆ వ్యక్తికి ఆశ పెరిగింది. ఈసారి రెండింతలు మూడింతలు లాభాలు పొందాలంటూ సందేశాలు రావడంతో వాటిపైనా అతడు క్లిక్ చేశాడు. మార్చి 24 నుంచి 26 వరకు విడతలవారీగా 13 సార్లు నగదును జమ చేశాడు.
పెద్ద మొత్తంలో జమ చేసినప్పటికీ తనకు ఎలాంటి నగదు తిరిగి రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు బాధితుడు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటున్నారు. మోసానికి గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు.
-
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications