వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన మునుగోడు-మన కాంగ్రెస్: వెయ్యిమంది టీమ్‌తో యాక్షన్ ప్లాన్ మొదలెట్టిన రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

మునుగోడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మునుగోడు పై ఫోకస్ పెట్టాయి. టిఆర్ఎస్, బీజేపీలు మునుగోడులో రాజకీయ వ్యూహాలతో దూసుకుపోతుంటే, కాస్త వెనుకబడినట్టు కనిపించిన కాంగ్రెస్ పార్టీ కూడా తన దూకుడును ప్రారంభించింది. మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు 20వ తేదీన స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని మునుగోడులోని 175 గ్రామాలకు కాంగ్రెస్ సమన్వయకర్తలను నియమించింది. కాంగ్రెస్ పార్టీ తన సేనను మొత్తంగా మునుగోడులో ఉపఎన్నికలో విజయం కోసం రంగంలోకి దించుతుంది.

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నేడు రంగంలోకి కాంగ్రెస్ నేతలు

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నేడు రంగంలోకి కాంగ్రెస్ నేతలు


శనివారం జరగనున్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 175 గ్రామాలకు కాంగ్రెస్ సమన్వయకర్తలను నియమించిన కాంగ్రెస్ పార్టీ మన మునుగోడు మన కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా ఆ పార్టీ సీనియర్‌ నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే పెరుగుతున్న అసమ్మతి నేపధ్యంలో వారు కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది క్లారిటీ లేదు.

పొర్లుతండాలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి


కోవిడ్ -19 నుండి కోలుకున్నందున, టిపిసిసి చీఫ్ ఎ రేవంత్ రెడ్డి కూడా మునుగోడులో రంగంలోకి దిగుతున్నారు. నేడు పొర్లు తండాలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ సంబరాల్లో భాగంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పార్టీ జెండాలను ఎగురవేసి నియోజకవర్గంలోని 40 వేల కుటుంబాలకు పండ్లు పంపిణీ చేయనున్నారు. దేశాభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన కృషిపై మాట్లాడాలని పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి సూచించారు.

మన మునుగోడు, మన కాంగ్రెస్ నినాదంతో ప్రచారం .. ప్రజాస్వామ్యానికి వందనం


మన మునుగోడు - మన కాంగ్రెస్ అనే నినాదంతో కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. "ప్రజాస్వామ్యానికి వందనం" అనే ప్రచారాన్ని వారు ప్రారంభించనున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ ప్రతి కాంగ్రెస్ నాయకుడు కనీసం 100 మంది ఓటర్లకు చేతులెత్తి 'వందనం' చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేయనున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా మునుగోడులోని తెలంగాణ సమరయోధుల కుటుంబాలను కలిసి వారికి వందనాలు చేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి వందనం అన్న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

వెయ్యి మంది కాంగ్రెస్ నాయకులు .. ఒక్కొక్కరికి వంద మంది ఓటర్లు

వెయ్యి మంది కాంగ్రెస్ నాయకులు .. ఒక్కొక్కరికి వంద మంది ఓటర్లు


అటు కేంద్రంలోని అధికార బీజేపీ, ఇటు రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉప ఎన్నికల్లో అడ్డగోలు అక్రమాలకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగుతున్న వెయ్యి మంది నాయకులు ప్రజాస్వామ్యానికి వందనం కార్యక్రమం ద్వారా లక్ష మందికి వందనం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేయబోతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా క్షేత్రంలో బీజేపీ, టీఆర్ఎస్ ల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు.

టీఆర్ఎస్, బీజేపీలను మునుగోడులో తరిమికొట్టాలన్న రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్, బీజేపీలను మునుగోడులో తరిమికొట్టాలన్న రేవంత్ రెడ్డి

ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులతో మునుగోడు లో జరిగే పోరాటం గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడులో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి టీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయన్నారు. టిఆర్ఎస్, బిజెపిలను తరిమి కొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ 'ప్రజాస్వామ్యానికి వందనం' కార్యక్రమం ద్వారా ప్రజాస్వామ్యాన్ని, దాని విలువలను కాపాడేందుకు కృషి చేయాలి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం తీసుకోవాలని రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

English summary
Mana Munugode Mana Congress campaign is starting from today on the occasion of Rajiv Gandhi Jayanti. Revanth Reddy, who has started an action plan with a team of 1000 people, is carrying out an innovative campaign as a salute to democracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X