ఆడపిల్ల పుట్టిందని భార్యకు తలాఖ్, భార్య ఏం చేసిందంటే?
Recommended Video

హైదరాబాద్: ఆడపిల్ల పుట్టిందని ఫాతిమా అనే మహిళకు భర్త అబుదాబి నుండి తలాఖ్ (విడాకులు) చెప్పాడు. ఖాజీ ద్వారా తన భార్యకు తలాఖ్‌ను చెప్పాడు మన్సూర్ . దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
హైద్రాబాద్ పాతబస్తీకి చెందిన ఫాతిమాకు మన్సూర్ అనే వ్యక్తితో వివాహమైంది,. మన్సూర్ అబుదాబీలో పనిచేస్తున్నారు. అయితే మన్సూర్ కుటుంబసభ్యులకు కొడుకు కావాలనే కోరిక బలంగా ఉంది.

మగపిల్లాడి కోసం పాతబస్తీలోని ఓ బాబా వద్దకు ఫాతిమాను పంపారు మన్సూర్ కుటుంబసభ్యులు. అయితే బాబా వికృత చేష్టలకు ఫాతిమా భయపడింది.
కుటుంబసభ్యుల బలహీనతను ఆసరాగా చేసుకొన్న బాబా... ఫాతిమా పట్ల వికృతంగా ప్రవర్తించేవాడు. దీంతో ఆమె బాబావద్దకు వెళ్ళడం మానేసింది.
అయితే ఇటీవలనే ఫాతిమా ఆడపిల్లకు జన్మనిచ్చింది. బాబా చెప్పినట్టుగా నడుచుకోని కారణంగానే ఆడపిల్ల పుట్టిందని ఫాతిమా అత్తింటివారు ఆమెను వేధింపులకు గురిచేశారు. అంతేకాదు ఆమెను ఇంటి నుండి బయటకు గెంటేశారు.
అబుదాబీలో ఉన్న భర్త మన్సూర్ ఆడపిల్ల పుట్టిన విషయం తెలుసుకొని ఖాజీ ద్వారా భార్యకు విడాకుల పత్రాలను పంపారు.












Click it and Unblock the Notifications