పిక్చర్ ఆఫ్ ద డే: చూడండి, గుంతలో బోల్తా పడ్డ ఆల్టో కారు
హైదరాబాద్: విద్యుత్ కేబుల్ వైర్ల ఏర్పాటు కోసం వెంగళరావు నగర్ పరిధిలోని మధురానగర్ 'జి' బ్లాక్ రోడ్డులో తవ్విన గుంతలో ఆదివారం ఉదయం ఓ ఆల్టో కారు బోల్తాపడింది. అదృష్టవ శాత్తూ కారులో ఉన్న వ్యక్తికి ఏమీ కాలేదు.
వివరాల్లోకి వెళితే... కృష్ణకాంత్ పార్క్ వైపు నుండి మధురానగర్-యూసఫ్ గూడరోడ్డు వైపు రామకృష్ణ అనే వ్యక్తి ఆదివారం ఉదయం తన మిత్రుడిని తన కారులో దిగబెట్టి వస్తున్నాడు. అయితే అదుపుతప్పి ప్రమాదవశాత్తూ అక్కడే గుంతలోకి కారు దూసుకుపోయింది.
వెంటనే స్పందించిన స్ధానికులు రామకృష్ణను బయటికి తీశారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పోరేటర్ కిలారి మనోహార్ సంబంధింత అధికారులకు సమాచారం అందించారు. అనంతరం క్రేన్ సహాయంతో కారును ట్రాఫిక్ సిబ్బంది కారును బయటకు తీశారు.

కాగా, ఇరుకైన దారుల్లో కేబుల్ గుంతలు తొవ్వి నెలల తరబడి వదిలేస్తండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మధురానగర్ డిజిజన్‌లోని కల్యాన్ నగర్ చౌరస్తా, జవహర్ నగర్-సిద్ధార్ధనగర్ రోడ్డులో కూడా ఇదే పద్ధతిలో కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. కేబుల్ వైర్ల ఏర్పాటుతో కొనసాగుతున్న పనులతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఈ సంఘటన మరోసారి రుజువు చేసిందని స్థానికులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications