సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం... కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు...

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుమ్మడిదల మండలం దోమడుగులోని సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఫైరింజన్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recommended Video

    Sangareddy Chemical Factory : సంగారెడ్డిలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం...!!
    massive fire broke out in chemical factory in sangareddy

    శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాద సంఘటన మరవకముందే సంగారెడ్డిలో అగ్నిప్రమాదం సంభవించడం గమనార్హం. శ్రీశైలం ప్రమాదంలో 9 మంది ఇంజనీర్లు ప్లాంట్‌ లోపలే చిక్కుకుపోయి మృతి చెందిన సంగతి తెలిసిందే. గురువారం(అగస్టు 20) రాత్రి ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగడంతో విధుల్లో ఉన్న 17 మంది లోపలే చిక్కుకుపోయారు. వీరిలో 8 మంది ఎస్కేప్ టన్నెల్స్ ద్వారా బయటపడగా... మిగతావారు లోపలే చిక్కుకుపోయి మృతి చెందారు. ఎన్‌డీఆర్ఎఫ్,సింగరేణి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగినప్పటికీ.. లోపల కమ్ముకుపోయిన దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+