వరంగల్ ఘోర ప్రమాదం: పోలీసుల అదుపులో భద్రకాలి పైర్ వర్క్స్ ఓనర్
వరంగల్: కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్స్క్‌లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో పోలీసులు బాణసంచా దుకాణ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండానే దీనిని నడిపిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని బాంబుల కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కాగా, బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించి పదకొండు మంది మృతి చెందిన విషయం తెలిసింగే. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చింది. భారీ శబ్దాలతో బాణసంచా పేలింది. ఆ సమయంలో గోదాములో 25 మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది.

మంటలు చెలరేగిన వెంటనే అక్కడ పనిచేసేవారు భయంతో బయటకు పరుగు తీశారు. పదిమంది కార్మికులు మంటల్లో సజీవ దహనం, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాయపడ్డ వారిని ఎంజీఎంకు తరలించారు.
వరంగల్ అగ్నిప్రమాదంపైసీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైసీపీ తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications