మెరిట్ కాదు మనీ ముఖ్యం: ఎంబీబీఎస్ అడ్మిషన్లలో ‘స్పోర్ట్స్’ కోటా అక్రమాలు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: మెడికల్‌ సీటు పొందాలంటే చాలా కష్టపడాలి. కోట్ల రూపాయలైనా ఉండాలి. ఈ రెండూ కాకుంటే మరోదారీ ఉంది. అదే స్పోర్ట్స్‌ కోటా. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉపయోగపడాల్సిన ఈ కోటా, కొందరు అక్రమాధికారుల చేతలతో వారికి దూరమవుతున్నది. రూ. కోట్లు పెట్టి మెడికల్‌ సీట్లు కొనుక్కోలేని వారు.. రూ. లక్షలు ముట్టజెప్పి స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లతోపాటు క్రీడాధికారులనూ కొనుక్కుంటున్నారు. దీంతో ప్రతిభ ఉన్న పేద, మధ్యతరగతి క్రీడాకారులకు తీవ్ర నష్టం జరుగుతోంది.
ఇలాంటి ఘటనే ఈ ఏడాది వెలుగులోకి వచ్చింది. ఉన్నప్రస్తుత విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్ అడ్మిషన్లలో పది సీట్ల కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగినట్టు ఆధారాలు బయటపడ్డాయి. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని మెడికల్ కాలేజీల్లో కలిపి 2000 వరకు సీట్లు ఉన్నాయి. వీటిలో వివిధ రిజర్వేషన్లలో భాగంగా స్పోర్ట్స్‌ కోటాకు 0.5శాతం కింద 10సీట్లు కేటాయించారు. వీటిని జీవో నంబర్‌ 10 ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.

ఇక సీ కేటగిరీ సీటు రూ.1.15 కోట్లు

ఇక సీ కేటగిరీ సీటు రూ.1.15 కోట్లు

ప్రస్తుతం ఒక్కో మెడిసిన్‌ సీటు ప్రైవేట్ కాలేజీల్లో బీ కేటగిరిలో రూ.55 లక్షల నుంచి రూ.65లక్షలు ఉండగా, సీ కేటగిరి (ఎన్‌ఆర్‌ఐ) రూ.1.15 కోట్లు పలుకుతోంది. అదే స్పోర్ట్స్‌ కేటగిరిలో సర్కారీ కాలేజీల్లో ఏడాదికి రూ.10,000, ప్రైవేట్ కాలేజీల్లో రూ.60 వేలు ఉంది. స్పోర్ట్స్‌ కోటా కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఎనిమిది మంది డిప్యూటీ డైరెక్టర్ల స్థాయి ఉన్న అధికారులతో ఒక కమిటీ ఉంటుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ఈ కమిటీలో చోటు కల్పించొద్దు. కానీ ఈ విద్యాసంవత్సరం వేసిన కమిటీలో మాత్రం ఒకరిద్దరు అటువంటి అధికారులకు స్థానం కల్పించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై విజిలెన్స్‌ విచారణ చేయిస్తున్నట్టు తెలుస్తోంది.

ముడుపులివ్వకుంటే అడ్మిషన్లకు నో చాన్స్

ముడుపులివ్వకుంటే అడ్మిషన్లకు నో చాన్స్

హైదరాబాద్‌ నగరానికి చెందిన భరత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హర్షితారాజ్‌ అనే విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు. రూలర్‌ స్కేటింగ్‌ హాకీలో రాష్ట్రస్థాయితోపాటు జాతీయ స్థాయిలో అనేక పతకాలను సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొన్నారు. వీరిద్దరూ 2017లో మెడికల్‌ సీట్ల కోసం స్పోర్ట్స్‌ కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారులు వీరిద్దరికీ ప్రాధాన్యం ఇవ్వకుండా సర్టిఫికెట్లు చెత్తబుట్టలో పడేశారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఫెడరేషన్‌ ఇచ్చిన సర్టిఫికెట్లనూ పట్టించుకోలేదు. దీనంతటికీ కారణం వారిద్దరూ అధికారులకు ముడుపులు ఇవ్వకపోవడమే. దరఖాస్తు పరిశీలించిన అధికారుల్లో ఒకరిద్దరికి కొన్ని డబ్బులు ఇచ్చినా.. ఇంకా పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. వారు మాట్లాడిన ఆడియో రికార్డులు బహిర్గతం చేస్తున్నాయి.

ఫెడరేషన్లు ఇచ్చిన ధ్రువీకరణకు అధికారులు ఓకే

ఫెడరేషన్లు ఇచ్చిన ధ్రువీకరణకు అధికారులు ఓకే

2008 నుంచి 2016 వరకు అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులకు నిబంధనల ప్రకారం ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో ఆయా క్రీడలో పాల్గొన్న వారికి ఆయా క్రీడావిభాగాల ఫెడరేషన్లు జారీ చేసిన సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో ఐదుగురు విద్యార్థులకు మెడిసిన్‌లో, ఇద్దరు విద్యార్థులకు ఇంజినీరింగ్‌లో సీట్లు కేటాయించారు. చిత్రంగా వీరిందరినీ ధృవీకరించిందీ ప్రస్తుత అధికారుల్లోనూ ఉన్నారు. కానీ ఈ విద్యాసంవత్సరం మాత్రం అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న సీనియర్‌ క్రీడాకారులుగా ఉన్న ఇద్దరు విద్యార్థులను మాత్రం పక్కన పెట్టారు. వీరికి ఫెడరేషన్‌తో పాటు శాప్ సర్టిఫికెట్లు ఉన్నా పరిగణనలోకి తీసుకోలేదు.

రూలర్ స్కేటింగ్ ఇన్ లైన్ హాకీలో ఇలా భాగస్వామ్యం

రూలర్ స్కేటింగ్ ఇన్ లైన్ హాకీలో ఇలా భాగస్వామ్యం

ఆటల్లో పాల్గొన్న వారికి, ఆయా స్థాయిలను బట్టి పాల్గొనట్టు పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌ను క్రీడాకారులకు అందిస్తాయి. కానీ కొందరు డబ్బులిచ్చి వాటిని కొనుగోలు చేసినట్టు ఆరోపణలూ ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం ఆంధ్రప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని రూలర్‌ స్కేటింగ్‌ ఇన్‌లైన్‌ హాకీలో జాతీయస్థాయిలో 2017లో పాల్గొన్నది. జాతీయస్థాయిలో పతకం రాలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ(సాట్స్‌) అధికారులు ఆమెకు పతకం వచ్చినట్టు రికార్డుల్లో రాసేశారు. దీంతో ఆమెకు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు కాలేజీలో ఓపెన్‌ స్పోర్ట్స్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీటు వచ్చింది. ఇదే విద్యార్థిని ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ సీటు కోసం దరఖాస్తు చేసుకుంటే, అక్కడ మాత్రం కేవలం ఆ విద్యార్థిని కేవలం పోటీల్లో మాత్రమే పాల్గొన్నట్టు అక్కడ అధికారులు ధృవీకరించారు.

కొందరు అధికారులకు కార్లు.. మిగతా వారికి లక్షలతో సంతర్పణ

కొందరు అధికారులకు కార్లు.. మిగతా వారికి లక్షలతో సంతర్పణ

ఈ సీటు విషయంలో సాట్స్‌ అధికారులకు భారీగా డబ్బులు ముట్టినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం కమిటీలో ఉన్న ఇద్దరు సీనియర్‌ అధికారులకు కార్లు కొనివ్వగా, మిగిలిన వారికి రూ.రెండు, మూడు లక్షల చొప్పున అందజేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్రీడాకోట సీట్లపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Medical Seat in MBBS Course is very pricieous. But now a days so many short cuts here. Any one student participation in sports then get to certificate of medal with back door consultations. This is done here in Telangana Sports quota.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి