హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో బోరు బావిలో పడిన 3 ఏళ్ల బాలుడు రాకేశ్ ఊపిరాడక మృతి చెందాడు. శనివారం ఉదయం 7 గంటల సమయంలో రాకేశ్ తోటి చిన్నారులతో కలిసి ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన సంగతి తెలిసిందే.

బాలుడిని రక్షించేందుకు అధికారయంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బోరుబావిలో తలకిందులుగా 32 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆదివారం తెల్లవారుజామున మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చిన్నారిని పరీక్షించిన వైద్యులు బాలుడు మృతిచెందినట్లు నిర్ధారించారు. చిన్నారి రాకేశ్ మృతితో బొమ్మారెడ్డి గూడెంలో విషాదం నెలకొంది. కాగా బోరు బావి తవ్వించి, కేసింగ్ పైపు తీసేసిన పొలం యజమాని కుమ్మరి రాములుపై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

పుల్కల్‌ మండలం బొమ్మరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి రాములు తన పొలంలో తెల్లవారుజామున బోరు తవ్వించాడు. అందులో నీళ్లు పడకపోవడంతో కేసింగ్‌ పైపు తీసేసి ఖాళీగా వదిలేశాడు. దానికి సమీపంలో బాలుడి ఇల్లు ఉంది.

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

గ్రామానికి చెందిన రైతుకూలీ బైరు సాయిలు, మొగులమ్మ దంపతుల ఇద్దరు కుమారుల్లో ఒకడు రాకేశ్(3). అన్న బాలేష్(5)తో కలిసి బోరుబావిని తవ్వగా వచ్చిన రాతిపిండితో ఆడుకున్నాడు. ఉదయం ఏడుగంటలకు రాకేష్‌తోపాటు అతని అన్న బాలేష్‌ అక్కలు భాగ్యలక్ష్మి, కీర్తనతోపాటు మరికొంతమంది పిల్లలు అటువైపుగా వెళ్లారు.

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

అక్కడ తవ్వి ఉన్న బోరు గుంతలోకి తొంగిచూశాడు. ప్రమాదవశాత్తు అమాంతం అందులోకి జారిపోయాడు. తమ్ముడిని పట్టుకునేందుకు పక్కనే ఉన్న అతడి అన్న బాలేశ్ ప్రయత్నించాడు. తమ్ముడి కాలు పట్టుకుని లాగబోయాడు. కానీ అదుపు తప్పడంతో రాకేశ్ తలకిందులుగా లోనికి పడిపోయాడు. వెంటనే బోరున విలపిస్తూ తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పాడు.

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

వారు సమాచారాన్ని స్థానిక సర్పంచి శోభ ద్వారా పోలీసులకు అందించారు. వెంటనే పుల్కల్‌ ఎస్సై సత్యనారాయణ, జోగిపేట సీఐ నాగయ్య సంఘటన స్థలానికి వచ్చారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. బాలుడికి ఇద్దరు అక్కలు, అన్న ఉన్నారు.

 బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

ఉదయం 8 గంటలకు సంఘటన స్థలానికి చేరిన పోలీసులు స్థానికుల సహాయంతో రెండు పొక్లెయిన్లతో సహాయక చర్యలు ప్రారంభించారు. బాలుడు 33 అడుగుల లోతులో ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. 108 సిబ్బంది ఆక్సిజన్‌ సిలిండర్‌లను అమర్చి బావిలోకి ఆక్సిజన్‌ పంపారు.

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

చుట్టు పక్కల పనులు చేస్తున్న మరో నాలుగు పొక్లెయిన్లను తీసుకువచ్చి తవ్వకాలను ముమ్మరం చేశారు. బోరుబావి పక్కనే పెద్ద పెద్ద బండలు ఉండడంతో సాయంత్రం 5 గంటల వరకు ఆరడుగుల వరకు మాత్రమే తవ్వారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టడంలేదని పెద్ద పొక్లెయిన్లను తీసుకురావాలని స్థానికులు ఆందోళన చేపట్టారు.

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

సహాయకచర్యల్లో అధికశక్తిగల మూడు పొక్లెయిన్లను, మూడు జేసీబీలు, రెండు చిన్న హిటాచీలు, మూడు పెద్ద హిటాచీలు పాల్గొన్నాయి. పోలీసులు వారిని నచ్చజెప్పి పనులు కొనసాగించారు.

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

శనివారం రాత్రంతా అధికార యంత్రాంగా, ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందం శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మంగళవారం ఉదయం బోరు బావి నుంచి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎంపీ పాటిల్, ఎమ్మెల్యే బాబుమోహన్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి పనులను పర్యవేక్షించారు. బోరుబావిలో పడ్డ బాలుడిని ప్రాణాలతో రక్షించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది.

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలుడు మృతి

బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, సాయిలు, మొగలమ్మ తీవ్రంగా రోదిస్తున్నారు. బాలుడు ప్రాణాలతో బయటపడతాడని ఆశతో ఎదురు చూసిన బొమ్మారెడ్డిగూడెం వాసులు శోక సంద్రంలో మునిగిపోయారు.

English summary
The three-year-old boy Rakesh who fell into a bore-well in Medak district passed away this morning. The body was retrieved at about 6 am on Sunday, almost 24 hours after the incident took place. The body was shifted to the government hospital at Sangareddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X