Medaram jatara: భక్తుల ఇళ్లకే మేడారం ప్రసాదం; జాతర పనులపై మంత్రి సీతక్క మార్క్!!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా, ప్రకృతిని పూజించే విగ్రహాలు లేని జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈనెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా జరగనుంది. ఈసారి మేడారం జాతర అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది.
మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఇంటికి ప్రసాదాలు పంపించే లాగా టీఎస్ ఆర్టీసీతో కలిసి దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో దేవాదాయశాఖ తో tsrtc లాజిస్టిక్స్ విభాగం ఒప్పందం కుదుర్చుకుంది.

మేడారం సమ్మక్క సారక్కల గద్దెల నుండి అమ్మవారి ప్రసాదంతో పాటు, పసుపు కుంకుమలను భక్తుల ఇళ్ల వద్దకు సంస్థ అందజేయనుంది. ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే మహా జా నిన్నటి నుండి ఆఫ్ లైన్లోనూ , ఆన్ లైన్లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని టిఎస్ఆర్టిసి లాజిస్టిక్స్ విభాగం కల్పించింది.
ఇదిలా ఉంటే మేడారం జాతరకు సమయం ఆసన్నం అవుతున్న తరుణంలో మేడారం జాతర పనులపై ఇటీవల రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రి సీతక్క జాతరకు సమయం దగ్గర పడుతుందని, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇక మేడారం జాతర ఎన్నో రోజులు లేదని, ఇకపై రివ్యూ మీటింగ్ లో ఉండవని ఇదే లాస్ట్ మీటింగ్ అని ఆమె స్పష్టం చేశారు.
Crowd is increasing day by day no difference in day and night prayed Sammakka saralamma thalli for a smooth going jathra.. #SammakkaSaralammaJathara pic.twitter.com/kmSUGCoDeb
— Danasari Seethakka (@seethakkaMLA) February 15, 2024
పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని మంత్రి సీతక్క తేల్చి చెప్పారు. జాతరకు పెండింగ్ ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు మండ మెలిగే పండుగతో ప్రారంభమయ్యాయి. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుకతో మేడారం జాతర మొదలైనట్టే చెప్తున్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications