టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్: భక్తుల ఇంటికే మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) భుక్తులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఒక పవిత్ర కార్యానికి టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది.
మేడారం మహా జాతర ఫిబ్రవరి 21 నుంచి 24వ తేది వరకు జరుగుతుండగా.. ఈ నెల 14 నుంచి 25వ తేది వరకు ఆన్‌లైన్/ఆఫ్ లైన్‌లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది. భక్తులు రూ.299 చెల్లించి సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్(కార్గో) కౌంటర్లలో, పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. https://rb.gy/q5rj68 లింక్ పై క్లిక్ చేసిగానీ లేదా పేటీఎం ఇన్ సైడర్ యాప్ లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చు.

'రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోలేని భక్తులకు ప్రసాదం(బంగారం) అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. బుకింగ్ చేసుకునే భక్తులకు ప్రసాదంతో పాటు అమ్మవార్ల పసుపు, కుంకుమను అందజేస్తాం. ఈ బుకింగ్ సదుపాయం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బుక్ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అనంతరం నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని సంస్థ అందజేస్తుంది' అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్(ఐపీఎస్) తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ (కార్గో) కౌంటర్లలో ఈ సేవ అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ ఏజెంట్స్ తో పాటు డిపోల పరిధిలో విధులు నిర్వర్తించే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లను సంప్రదించి ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చని తెలిపారు. లాజిస్టిక్స్ కేంద్రాలకు వెళ్లలేని భక్తులు ఆన్‌లైన్‌లో పేటీఎం ఇన్ సైడర్ పోర్టల్‌లో గానీ యాప్ లోనూ సులువుగా ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆన్ లైన్ బుకింగ్ సమయంలో భక్తులు తమ సరైన చిరునామా, పిన్ కోడ్, ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదుచేయాలన్నారు.
మేడారం ప్రసాద బుకింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లను గానీ, టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లైన 040-69440069, 040-69440000, 040-23450033 సంప్రదించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications