మీడియాపై దాడి ప్లాన్ ప్రకారమా?: కష్టపడి పైకొచ్చిన ఎస్సై ప్రభాకర్ రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

సిద్దిపేట: కుకునూరుపల్లిలో బుధవారం సాయంత్రం జరిగిన అలజడిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మీడియాపై దాడి ముందస్తు ప్లాన్‌తో జరిగిందా? వారిని ఎవరు రెచ్చగొట్టారు? దాడి వెనుక కారణాలు ఏమిటి, పోలీస్ స్టేషన్ వద్దకు అంతమంది ఎలా వచ్చారని ఆరా తీస్తున్నారు.

చదవండి: బ్యూటీషియన్‌తో ఎస్సై అసభ్యత?: భర్త స్పందన, రాత్రి అక్కడ ఎందుకు ఉంది?

బ్యూటీషియన్ శిరీష మృతితో ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఉందనే ప్రచారం కుకునూరుపల్లి గ్రామస్తులకు ఆగ్రహం తెప్పించింది. అందులో పలువురు మీడియా వాహనాలపై దాడి చేశారు. ఈ దాడి ఘటనను పోలీసులు ఆరాతీస్తున్నారు.

పెద్ద ఎత్తున వచ్చిన నిరసనకారుల్లో కొంతమంది ఈ దాడికి పాల్పడ్డారు. ఎన్టీవీ వ్యానును తగులబెట్టారు. మరో న్యూస్ ఛానల్ వ్యానును ఆదీనంలోకి తీసుకొని తమ వాదన వినిపించారు. ఈ సమయంలో పోలీసులు ఏం చేయలేకపోయారని అంటున్నారు.

వందల మంది ఎలా వచ్చారు? ఈ దాడి ప్లాన్ ప్రకారం జరిగిందా?, ఈ దాడి వెనుక కారణం ఏమయి ఉంటుంది? అల్లరి మూకలను ఎందుకు గుర్తించలేకపోయారు? వారిని ఎవరు రెచ్చగొట్టారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరోవైపు, ఈ ఘటనపై సీఎం కార్యాలయం కూడా స్పందించిందని తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారని తెలుస్తోంది. ఉన్నతాధికారులు నివేదిక ఇవ్వనున్నారు.

Media van burns in Kukunoorpally

ఎవరీ ఎస్సై ప్రభాకర్?

ఎస్సై ప్రభాకర్ కుకునూరుపల్లిలో పని చేస్తూ, బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన స్వగ్రామం ఆలేరు దగ్గరి టంగుటూరు. ఆయన ఆత్మహత్య విని టంగుటూరు వాసులు షాక్‌కు గురయ్యారు.

చదవండి: బ్యూటీషియన్ మృతితో ఎస్సైకి లింక్: కుకునూరుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత

ప్రభాకర్ ఆత్మహత్య వార్త విని షాక్‌కు గురయ్యామని, ఆయన మృతి బాధాకరమని, ఆయన మూడేళ్లున్నప్పుడే హెల్పర్‌గా పని చేసే తండ్రి చనిపోతే కష్టపడి పైకి వచ్చాడని, కానిస్టేబుల్ నుంచి ఎస్సై స్థాయికి ఎదిగాడని గుర్తు చేసుకుంటున్నారు.

ప్రభాకర్ రెడ్డి వాళ్లు ముగ్గురు అన్నదమ్ములు అని, ఊళ్లో అతను అందరితో బాగా కలిసి ఉండేవాడని, వారికి అయితే ఎలాంటి కుటుంబ కలహాలు లేవని, ఈ మృతిపై అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police are enquiring about Media van burnt in Kukunoorpall in Siddipet district on Tuesday evening.
Please Wait while comments are loading...