భర్త మరణించిన 11నెలల తర్వాత తల్లి అయిన మహిళ.. తప్పుగా అనుకుంటే పప్పులో కాలేసినట్టే!!

వైద్య రంగంలో అద్భుత ఘట్టానికి తెలంగాణ రాష్ట్రం వేదికైంది. జీవితంలో ఒక్కసారైనా అమ్మ అనిపించుకోవాలని భావించిన ఓ మహిళ భర్త మరణించిన తర్వాత అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. భర్త ప్రతి రూపాన్ని తన కడుపులో మోసి పండంటి బిడ్డకు జన్మనివ్వాలని భావించిన మహిళ అయిన వాళ్లతో పోరాటం చేసింది. తన భర్త ప్రతిరూపం కోసం న్యాయస్థానంలో పోరాటం చేసిన మహిళ చివరకు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అసలు ఇంతకీ ఆ మహిళ ఏం చేసింది అనేది తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.

 పిల్లలు లేని జంట అండం, వీర్య కణాలు భద్రపరిచిన వైద్యులు

పిల్లలు లేని జంట అండం, వీర్య కణాలు భద్రపరిచిన వైద్యులు

మంచిర్యాలకు చెందిన ఓ జంటకు 2013వ సంవత్సరంలో వివాహం జరిగింది.అయితే పెళ్లయి ఏడేళ్ళు దాటినా వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో వారు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న క్రమంలో 2020 నుండి వరంగల్లోని ఓ సంతాన సాఫల్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. 2020 మార్చి నెలలో పరీక్షల నిమిత్తం ఆసుపత్రి వైద్యులు భర్త నుండి వీర్యకణాలను, భార్య నుండి పిండాన్ని తీసుకుని ఫ్రీజర్ లో భద్రపరిచారు. ఆతర్వాత కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో 2021లో భార్యాభర్తలిద్దరూ కరోనా మహమ్మారి బారిన పడ్డారు.

భర్త ప్రతిరూపాన్ని చూసుకోవాలని భావించి సాహసోపేతమైన నిర్ణయం

భర్త ప్రతిరూపాన్ని చూసుకోవాలని భావించి సాహసోపేతమైన నిర్ణయం

కరోనాతో పోరాడిన భర్త ప్రాణాలను కోల్పోగా, భార్య ఒంటరిగా మిగిలిపోయారు. పిల్లలు కావాలి అని తపించిన సదరు మహిళ, భర్త మరణం తర్వాత మరింత కుంగిపోయింది. ఎలాగైనా భర్త ప్రతి రూపాన్ని చూసుకోవాలని భావించిన సదరు మహిళ వరంగల్లోని సంతాన సాఫల్య కేంద్రం వైద్యులను సంప్రదించింది.

ఆసుపత్రిలో భద్ర పరిచిన భర్త వీర్యం ద్వారా తాను తల్లిని కావాలనుకుంటున్నట్టు సదరు మహిళ తెలిపింది. ఆమె తీసుకున్న నిర్ణయం విని వైద్యులు షాక్ అయ్యారు. భర్త మరణం తర్వాత ఆయన వీర్యంతో తల్లి కావాలని భావించిన మహిళ నిర్ణయాన్ని ఎవరూ అంగీకరించరని చెప్పారు.

భర్త లేకుంటే ఐవీఎఫ్ సాధ్యం కాదన్నా కోర్టుకెళ్ళి సాధించిన మహిళ

భర్త లేకుంటే ఐవీఎఫ్ సాధ్యం కాదన్నా కోర్టుకెళ్ళి సాధించిన మహిళ

ఒకపక్క కుటుంబ సభ్యులు మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. మరోపక్క వైద్యులు సంతానం కోసం మహిళకు ఐవిఎఫ్ చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరూ సంతకాలు కావాలని, భర్త లేకపోవడం వల్ల అది సాధ్యం కాదని చెప్పారు. దీంతో కోర్టు మెట్లెక్కిన మహిళ తన భర్త ప్రతి రూపాన్ని తాను చూసుకోవాలని తన దృఢ సంకల్పాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్ళింది. దీంతో కోర్టు అనుమతినిచ్చింది.

భర్త మరణం తర్వాత భర్త వీర్యంతో గర్భవతిగా.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

భర్త మరణం తర్వాత భర్త వీర్యంతో గర్భవతిగా.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

2021లో ఆమెకు వైద్యులు భద్రపరిచిన భర్త వీర్యం ద్వారా ఐవిఎఫ్ చికిత్సను చేశారు. ఆపై గర్భం ధరించిన సదరు మహిళ గత నెల 11వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. భర్త మరణించిన 11 నెలల తర్వాత భర్త ప్రతిరూపాన్ని చేతుల్లో తీసుకుని తనివితీరా ముద్దాడి మాతృత్వాన్ని పంచింది సదరు మహిళ. భర్తనే శిశువుగా మార్చి, ఆయన లేని లోటును ఆ పసికందులో చూసుకోవాలని నిర్ణయం తీసుకుంది. భర్తపై ఆ మహిళకు ఉన్న ప్రేమకు, బిడ్డలపై ఆ తల్లి కున్న మమకారానికి, తాను నమ్మిన దానికోసం సమాజంతో పోరాడిన ఆమె తెగువకు హ్యాట్సాఫ్ అనాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+