Telangana Weather Man: వరణుడికి బ్రాండ్ అంబాసిడర్.. చెప్పాడంటే వాన పడాల్సిందే..!

Telangana Weather Man:హైదరాబాద్‌లో మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురవబోతోంది. అంతా త్వరగా ఇళ్లకు చేరుకోండి. తెలంగాణలో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. దయచేసి అంతా జాగ్రత్తగా ఉండండి. రామగుండంలో ఈరోజు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఏంటి ఇన్ని వాతావరణం అప్‌డేట్స్ అనుకుంటున్నారా.. అదేం లేదండీ. పోనీ వాతావరణ శాఖ హెచ్చరికలా.. అంటే అదీకాదు. మరేంటనేగా మీ డౌటు..?

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలామంది సేఫ్‌గా ఉన్నారంటే అందుకు కారణం సోషల్ మీడియా. సోషల్ మీడియాలో వచ్చే వెదర్ అప్‌డేట్స్. అయితే ఇంత పక్కాగా వాతావరణ వివరాలు ఎవరు చెబుతున్నారనుకుంటున్నారా.. ఇంకెవరండీ బాబూ.. మన తెలంగాణ వెదర్ మ్యాన్. ఔను ట్విటర్ వేదికగా బాలీజీ అనే వెదర్ మ్యాన్ ఈ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తన ట్విటర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంతకీ ఎవరీ క్యూట్ బాయ్ అనుకుంటున్నారా.. లెక్క తప్పకుండా ఇంత పక్కాగా ఎలా అప్‌డేట్స్ ఇస్తున్నారని నివ్వెరపోతున్నారా.. ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

telanganaweatherman

ట్విటర్‌లో తెలంగాణ వెదర్ మ్యాన్ పేరుతో తెలంగాణ ప్రత్యేకించి హైదరాబాద్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలను పొల్లు తప్పుపోకుండా అందిస్తున్నాడు బాలాజీ అనే వ్యక్తి. బాలాజీ వయసు 17 ఏళ్లు. హైదరాబాద్ జేఎన్‌టీయూలో సివిల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వాతావరణం పరంగా బాలాజీ అంచనాలు ఎక్కడా తప్పుపోలేదు. 99శాతం ఎక్యూరేట్‌గా ఉంటాయి ఫలితాలు.గత 15 రోజులుగా బాలాజీ ఇస్తున్న వెదర్ అప్‌డేట్స్‌తో చాలామంది సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటున్నారు. దీంతో ఆయన్ను తన సొంత మనిషిలా భావిస్తున్నారు. అందుకే తన ట్విటర్ అకౌంట్‌కు యమ క్రేజ్ ఉంటుంది.

ఒకప్పుడు వాతావరణ శాఖ రిపోర్ట్ వచ్చే వరకు అసలు వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలియదు. ఒకవేళ ఆ రిపోర్టు వచ్చినా 100శాతం కరెక్ట్ అని చెప్పలేము. కానీ వెదర్ మ్యాన్ ఇచ్చే వెదర్ అప్‌డేట్స్‌పై మాత్రం సిటిజెన్లు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్‌లో ప్రభుత్వానికి చెందిన వాతావరణశాఖ అధికారిక అకౌంట్‌కు 7,965 మంది ఫాలోవర్లు ఉంటే Telangana weatherman అకౌంట్‌కు మాత్రం 63,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు బాలాజీని ఫాలో అవుతున్నారు.

ఇంకా చెప్పాలంటే ఈ 17ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్ బాలాజీకి ప్రధాని నరేంద్ర మోదీ ఫ్యాన్ అయ్యాడంటే ఇంతకంటే ఈయన గురించి ఏం చెప్పాలి.మన్ కీ బాత్‌లో బాలాజీ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించడం గొప్ప విషయం. బాలాజీ కేవలం వర్షాన్ని మాత్రమే అంచనా వేయడు, ఏ మేరకు గాలులు వీస్తాయో కూడా చెప్పగలడు. బలమైన గాలులు వీస్తే మేఘాలు దిశను మార్చుకునే అవకాశం ఉంది. ఇది వర్షంపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+