సన్మానం: చిరంజీవి పేరిట బంగారు నాణేలను విడుదల చేసిన కానా (ఫోటోలు)
హైదరాబాద్: చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలందించినందుకు గాను పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి పేరిట ఆయన అభిమానులు కాయిన్స్‌ను విడుదల చేశారు. జూబ్లిహిల్స్‌లో అక్టోబర్ 26న (సోమవారం) డల్లాస్‌కు చెందిన చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (కానా) ఆధ్వర్యంలో చిరంజీవిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కానా చిరంజీవి పేరిట కాయిన్స్ విడుదల చేసింది. దీంతో పాటు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు, తమిళం, హిందీ, కన్నడలో సాధించిన విజయాలు, రికార్డులతో పాటు ఆయన సినీ జీవిత విశేషాలతో కూడిన ఓ సంచిక రూపంలో ప్రత్యేకంగా అందజేశారు.

చిరంజీవి పేరిట బంగారు నాణేలను విడుదల చేసిన కానా
చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలందించినందుకు గాను పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి పేరిట ఆయన అభిమానులు కాయిన్స్‌ను విడుదల చేశారు. జూబ్లిహిల్స్‌లో అక్టోబర్ 26న (సోమవారం) డల్లాస్‌కు చెందిన చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (కానా) ఆధ్వర్యంలో చిరంజీవిని ఘనంగా సన్మానించారు.

చిరంజీవి పేరిట బంగారు నాణేలను విడుదల చేసిన కానా
చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌ను స్ధాపించి ప్రజలకు చేసిన సోషల్ సర్వీస్‌తో పాటు రాజకీయ జీవితం గురించిన విశేషాలను సైతం అందులో పొందుపరిచారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన బ్రూస్ లీ చిత్రంపై మాట్లాడారు.

చిరంజీవి పేరిట బంగారు నాణేలను విడుదల చేసిన కానా
చరణ్‌తో కలిసి ఓ చిన్న పాత్ర చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే తన 150వ సినిమాపై చిరంజీవి ఎలాంటి ప్రకటనా చేయలేదు. చిరంజీవి 150వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో చిరంజీవి 150వ సినిమాలో నటించనున్నారంటూ వార్తల్లో ప్రధానంగా నిలిచారు.

చిరంజీవి పేరిట బంగారు నాణేలను విడుదల చేసిన కానా
ఈ కార్యక్రమంలో కానా తరుపున ముత్యాల చిట్టి, చించుల ముఖేష్, సత్య, భవిరెడ్డి శ్రీనివాస్, గుడిసేవ విజయ్, చింతలపూడి అనిల్, రాజ్ కల్యాణ్, నంబూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications