Weather Update: రాష్ట్రానికి వర్షసూచన.. ఎల్లో అలర్ట్ జారీ..!

తెలంగాణలో వచ్చే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. తెలంగాణ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాలు కురుస్తున్న సమయంలో చెట్ల కింది వెళ్లొద్దని కోరింది. హైదరాబాద్ లో కూడా చిరుజల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. నవంబర్ 1 వరకు చిన్నపాటి జల్లులు పడతాయని తెలిపింది.

ఆకాశం మేఘావృతమై ఉండి జల్లులు కురిసే అవకాశం ఉండడంతో చలి తీవ్రత తగ్గుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత క్రమంగా చలి పెరుగుతుందని అంచనా వేసింది. లా నీనా కారణంగా ఈ సంవత్సరం చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అక్టోబర్, నవంబర్ మధ్య వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో లా నీనా ఏర్పడినట్లు పేర్కొంది. హైదరాబాద్ లో ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువ ఉంటుందని హెచ్చరించింది. పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

meteorological department has predicted light showers in Telangana

రెండు మూడు రోజులు క్రితం వరకు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివార్లలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. 16 నుంచి 17 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30-33 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ముఖ్యంగా తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కవగా కనిపిస్తుంది. తేలికపాటి వర్షాల కురిసే అవకాశం ఉండడంతో చలి తీవ్ర తగ్గతుంది. అయితే తర్వాత క్రమంగా చలి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

చలికాలం వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అస్తమా ఉన్నవారు చలికి దూరంగా ఉండాలని సూచించారు. రాత్రి పూట బయట తిరగొద్దని పేర్కొంటున్నారు. కాగా ఈ వర్షాకాలం సీజన్ లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయింది. సెప్టెంబర్, అక్టోబర్ లో ఎక్కువ వర్షపాతం నమోదయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+