తెలంగాణా వైద్య, ఆరోగ్య రంగంలో భారీ నియామకాలు.. ఇది చారిత్రక ఘట్టం అన్న మంత్రి
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ఆవిష్కరించారు వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు తెలంగాణా వైద్య ఆరోగ్య రంగంలో నియామకాలను చేపట్టటం చాలా సంతోషం అని ఆయన పేర్కొన్నారు.. ఇది మనం వైద్య ఆరోగ్య రంగానికి ఇచ్చే ప్రాధాన్యతకు తార్కాణం అన్నారు.
నియామకాల ప్రక్రియపై మంత్రి దామోదర రాజనర్సింహ
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (టీవీవీపీ) పరిధిలో 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టులు భర్తీ చెయ్యటం ఒక గొప్ప ముందడుగుగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా వైద్య సేవల విషయంలో వెనక్కు తగ్గటం లేదని ఆయన చెప్పారు. నేటి నియామకాల ప్రక్రియ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వేసిన ముందడుగుగా ఆయన అభివర్ణించారు.

692 పోస్టులు భర్తీపై మంత్రి దామోదర రాజనర్సింహ
అనస్తేషియా విభాగంలో - 226, గైనకాలజీ - 247, పీడియాట్రిక్స్ - 219, మొత్తం - 692 పోస్టులు భర్తీ చేయటం, వీరికి నియామక పత్రాలను అందించటం నిజంగా గర్వించాల్సిన సందర్భం అన్నారు.ఎంపికైన డాక్టర్లకు నియామక పత్రాలు అందించారు.ఇది యువ వైద్యుల బాధ్యతాయుతమైన సేవా మార్గానికి ఆరంభం అని ఆయన పేర్కొన్నారు.
1616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, నియామకాల ప్రక్రియ యజ్ఞంలో వైద్య ఆరోగ్య శాఖ నుండి మొత్తం 1616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే అందులో 692 పోస్టుల భర్తీ పూర్తయిందన్నారు. మిగిలిన 924 పోస్టులు త్వరలోనే మే నెలలో భర్తీ చెయ్యనున్నాం అని శుభవార్త చెప్పారు. వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి 607 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం అన్నారు.
మెడికల్ ఎడ్యుకేషన్‌ను బలోపేతం చేసే నియామకాలు
అందులో 174 పోస్టుల భర్తీ చేసామని, మిగతావి కూడా త్వరలోనే భర్తీ చేస్తామని అన్నారు. ఈ నియామకాలు మెడికల్ ఎడ్యుకేషన్‌ను బలోపేతం చేయటం కోసం, ఉత్తమ వైద్యులను తీర్చిదిద్దటం కోసం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. గతానికి భిన్నంగా, గత పాలకులు వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్య రంగంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టిందన్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద నియామకాల జాతర
గత 2.5 సంవత్సరాల్లో 9572 పోస్టులు భర్తీ చేయటం వైద్య రంగానికి మన ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను చెప్పకనే చెప్తుంది. ప్రస్తుతం 7562 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో 866 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఇంత పెద్ద నియామకాల జాతర నిర్వహిస్తున్నాం అంటే అది కేవలం పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలనే.. సంకల్ప బలంతోనే అన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ.
భవిష్యత్ లోనూ నియామకాలు
భవిష్యత్ లో కూడా నియామకాల ప్రక్రియ కొనసాగుతుంది. 2312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయన్నారు. దీంతో ఈ ఉద్యోగాల భర్తీ సంఖ్య 12,750కి చేరనుంది. ఈ నియామకాలు ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను చూపిస్తున్నాయి. కొత్తగా ఎంపికైన డాక్టర్ల బాధ్యతను గుర్తు చేస్తున్నాయన్నారు.
-
టెన్త్ క్లాస్ అర్హత తోనే ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ జీతంతో !! -
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలు! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!!













Click it and Unblock the Notifications