పీకల్లోతు చిక్కుల్లో మంత్రి కొండా సురేఖ.. శరవేగంగా అనూహ్య పరిణామాలు!
మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న కొండా సురేఖ నివాసం వద్ద, మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతో పాటు ఔట్ పోస్టును కూడా పోలీసులు తొలగించారు. ఇక తాజా పరిణామాలపై కొండా ఫ్యామిలీ భగ్గుమంటుంది.
తాజా పరిణామాలపై స్పందించిన కొండా మురళి
కొండా సురేఖ వ్యక్తిగత ఓఎస్డి గా పనిచేసిన సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. నేడు హన్మకొండలోని రాంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి అన్నారు. సురేఖ మంత్రి కార్యాలయానికి తను ఒకసారి వెళ్ళానని, అక్కడ ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదన్నారు.

ఎవరో కావాలని చేస్తున్న సృష్టి
హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలు ఎవరో కావాలని చేస్తున్న సృష్టిగా ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కావాలని తాను సురేఖ కష్టపడ్డామని, వైయస్సార్ తర్వాత రేవంత్ రెడ్డిని అంతగా తాము నమ్మమన్నారు. ఏ మంత్రులతో తమకు విభేదాలు లేవని, అందరి మంత్రుల ఇళ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం తనకు ఉందని కొండా మురళి తెలిపారు.
మాకు ఎవరితో విబేధాలు లేవు
రేవంత్ రెడ్డికి తమకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఎవరైనా సృష్టిస్తే దాంతో మాకు సంబంధం లేదని ఆయన అన్నారు. తాను వరంగల్లో అబ్జర్వర్స్ ప్రోగ్రాంకి వెళుతున్నానని పేర్కొన్న ఆయన జరుగుతున్న పరిణామాలు తెలుసుకొని స్పందిస్తాం అన్నారు. కొండా సురేఖ హైదరాబాద్ లో ఉన్నారని ఈరోజు వరంగల్ తూర్పు లో సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు.
తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించిన కొండా సురేఖ కుమార్తె
తాను కొండ సుస్మితతో మాట్లాడానని, అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా చెప్పారని పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు, తప్పకుండా ఇస్తారంటూ కొండా మురళి పేర్కొన్నారు. కాగా కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించారు. ఆమె ఒక వీడియో విడుదల చేశారు. కొండా కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పేర్కొన్నారు.
తమ కుటుంబంపై కుట్ర చేస్తున్నారని ఆగ్రహం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో సహా జిల్లా కు చెందిన కడియం శ్రీహరి,బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అందరూ కలిసి మా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, తమపై కుట్రలు చేస్తున్నారని ఆమె అన్నారు.
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదన్న కొండా సుస్మిత
ప్రస్తుతం ఇంట్లో తాను ఒక్కదాన్నే ఉన్నానని మా ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారని ఆమె తెలిపారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని అయినా ఎవరికీ భయపడేది లేదని తెలిపారు. కొండా కార్యకర్తులు ఎవరూ భయపడద్దని అందరూ ధైర్యంగా ఉండాలని ఆమె కోరారు.
-
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
ఉచిత బస్సే జిందా తిలిస్మాత్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications