కొండా సురేఖకు బిగ్ షాక్- రాత్రికి రాత్రి ఉత్తర్వులు..!!

తెలంగాణ అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. ఆమె వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పని చేస్తోన్న ఎన్ సుమంత్ పై ప్రభుత్వం వేటు వేసింది. విధుల నుంచి ఆయనను తొలగించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొండా సురేఖ ఆదేశాల మేరకు 2023 డిసెంబర్ 17వ తేదీన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా జాయిన్ అయ్యారు సుమంత్. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీ నాటికి ఆయన కాంట్రాక్ట్ గడువు ముగిసింది. అయినప్పటికీ- దీన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. ఈ ఏడాది డిసెంబర్ 16 వరకు ఆయన విధుల్లో కొనసాగాల్సి ఉంది. కాలుష్య నియంత్రణ మండలి ఆయన వేతనాలు, ఇతర సౌకర్యాలను కల్పిస్తోంది.

Minister Konda Surekha s OSD terminated from the duty with immediate effect

ఓఎస్డీగా కొండా సురేఖ వద్ద చేరారు. ఆమె పేషీలో కీలక అధికారిగా ఎదిగారని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దేవాదాయ, అటవీ మంత్రిత్వ శాఖలో బదిలీలు, పోస్టింగ్‌లను ఇప్పిస్తూ లక్షల రూపాయలను ఆర్జించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. పర్యావరణ అనుమతులకు సంబంధించిన ఫైళ్లను ఆమోదించే విషయంలో స్టోన్ క్రషర్ల నుంచీ వసూళ్లకు పాల్పడినట్లు చెబుతున్నారు. మేడారం జాతర నిధుల్లోనూ గోల్ మాల్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

ఈ ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. విచారణకు ఆదేశించింది. ఓఎస్డీ హోాదాలో అటవీ, కాలుష్య నియంత్రణ మండలి, దేవాదాయ మంత్రిత్వ శాఖల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలడంతో ఆయనను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి రవి గుగులోతు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు. ఉత్తర్వులు వెలువడిన తర్వాతే సుమంత్ ను తొలగించిన విషయం కొండా సురేఖకు తెలిసినట్లు చెబుతున్నారు.

కొండా సురేఖ, వరంగల్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు సాగుతున్నాయి. ఇద్దరూ బహిరంగంగా విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం ఇబ్బందికరంగా మారినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు తెలియకుండానే ఓఎస్డీపై వేటు వేయడం అటు రాజకీయంగా వివాదాన్ని రేకెత్తించినట్లు భావిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+